
న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, పార్టీ నేత అంబికా సోనితో కలిసి బుధవారం పరామర్శించారు. డీకే సోదరుడు సురేష్ కూడా కాంగ్రెస్ నేతల వెంట ఉన్నారు. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా డీకేకు సోనియా భరోసా ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు డీకే బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. మనీ ల్యాండరింగ్ కేసులో డీకే శివకుమార్‌ను ఈడీ సెప్టెంబర్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపిన డీకే పన్నుల ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డీకే అరెస్ట్ అనంతరం ఆయన 23 ఏళ్ల కుమార్తె ఐశ్వర్యను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించారు. 2013లో రూ కోటి నుంచి 2018లో రూ 100 కోట్లకు ఆమె నికర ఆస్తులు ఎలా పెరిగాయని ఐడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment