
3 నెలలు గడిచాక కేసును మూసివేయిస్తానని అప్పట్లో సీఎం యడియూరప్ప చెప్పారని, ఇంతవరకు కేసును మూసేయలేదని డీకే శివకుమార్ చెప్పారు.
శివాజీనగర: కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీపై నమోదు చేసిన కేసును మూసివేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. గతంలో పీఎం కేర్స్ నిధులు దుర్వినియోగమైనట్లు విమర్శిస్తూ కాంగ్రెస్ వెబ్‌సైట్‌లో ట్వీట్లు చేయగా శివమొగ్గ జిల్లా సాగర పోలీసులు సోనియాపై కేసు నమోదు చేశారు. 3 నెలలు గడిచాక కేసును మూసివేయిస్తానని అప్పట్లో సీఎం యడియూరప్ప చెప్పారని, ఇంతవరకు కేసును మూసేయలేదని డీకే శివకుమార్ చెప్పారు.
చదవండి: దినకరన్ యూటర్న్.. చిన్నమ్మ నిర్ణయం ఏమిటో?