బనశంకరి: పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ తొలి ప్రాధాన్యమని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు గ్యారెంటీ హామీలను నెరవేరుస్తామన్నారు. శనివారం నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి పార్టీ నేతలందరూ విచ్చేస్తారని, దేశంలోని అనేకమంది నేతలకు ఆహ్వానించామని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, పార్టీపెద్దలతో భేటీ అయి విస్తృతంగా చర్చించారని, గ్యారెంటీ పథకాలు డీకే శివకుమార్, సిద్దరామయ్య హామీలు కాదని, ఇవి కాంగ్రెస్ పార్టీ పథకాలని అన్నారు.
కాగా సుదీర్ఘ చర్చల అనంతరం సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో శనివారం వీరిద్దరు బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచ్చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment