డిప్యూటీ సీఎం డీకేతో వైఎస్‌ షర్మిల భేటీ | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం డీకేతో వైఎస్‌ షర్మిల భేటీ

Published Tue, May 30 2023 7:14 AM | Last Updated on Tue, May 30 2023 7:55 AM

- - Sakshi

సాక్షి, బెంగళూరు: కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. సోమవారం బెంగళూరు సదాశివనగరలోని డీకే నివాసంలో షర్మిల ఆయనతో సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాలం నుంచి ఆ కుటుంబానికి డీకే శివకుమార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కన్నడనాట కాంగ్రెస్‌ ఘన విజయం నేపథ్యంలో షర్మిల ఆయనకు శుభాభినందనలు తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించుకున్నారు. ఇదొక మర్యాదపూర్వకమైన భేటీ అని డీకే శివకుమార్‌ కార్యాలయం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement