సాక్షి, తాండూర్: కర్ణాటకలో కాంగ్రెస్ వాగ్దానం చేసిన ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్న ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. అక్కడ రైతులకు ఐదు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నామన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు(శనివారం) తాండూర్‌లో పర్యటించారు. ఈ మేరకు ఇంగ్లిష్‌లో మాట్లాడిన డీకే శివకుమార్.. కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ మాత్రమే రైతులకు ఇస్తున్నామన్నారు.
‘మీ ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. పదేళ్లయినా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. మేం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాము.. కానీ పదేళ్లయినా కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు.కర్ణాటకలో 5 గ్యారంటీలను అమలు చేసాం’ అని తెలిపారు. అయితే కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ మాత్రమే రైతులకు ఇస్తున్నామని డీకే చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment