తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే.. | These Congress Leaders Likely Get First-Time Minister Posts In Telangana - Sakshi
Sakshi News home page

తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే..

Published Thu, Dec 7 2023 12:28 PM

Leaders Get Minister Posts First Time In Telangana - Sakshi

హైదరాబాద్: తెలంగాణలో మరికాసేప‍ట్లో ప్రభుత్వం కొలువుదీరనుంది. టీపీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రేవంత్ రెడ్డితో పాటు 11 మంది నాయకులు మంత్రి పదవులు చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం బహిర్గతం చేసింది. తొలిసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనుండగా, మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తొలిసారి మంత్రి పదవి చేపట్టినవారవుతారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గగా.. సీపీఎం 1 స్థానంలో విజయం సాధించింది. అనంతరం ముఖ్యమంత్రి పదవిపై తర్జనభర్జన చేసిన కాంగ్రెస్ కేంద్ర అధిష్ఠానం ఎట్టకేలకు రేవంత్‌ను నిర్ణయించింది. ఆయనతో పాటు మరో 11 మందికి మంత్రి పదవులను కూడా ఫైనల్ చేసింది. ఎల్బీ స్టేడియంలో నేడు వీరంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

రేవంత్ రెడ్డితో పాటు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న 11 మంది నాయకుల జాబితాలో భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ ఉన్నారు. 

ఇదీ చదవండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్థిక శాఖ?

Advertisement
 
Advertisement