
బెంగళూరు: కర్ణాటక కేబినెట్ శుక్రవారం(జులై 26) కీలక నిర్ణయం తీసుకుంది. రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చారు. పేరు మార్పు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించినట్లు న్యాయ, శాసనసభా వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు.
రామనగర జిల్లాలోని మాగడి, కనకాపుర, చెన్నపట్న,హరోహల్లి తాలూకాలు బ్రాండ్ బెంగళూరు వినయోగించుకోవడం కోసమే పేరు మార్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఈ పేరు మార్పు ఉంటుందని రామనగర జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత ఏడాదే వెల్లడించారు. జిల్లా పేరు మార్చాలని డీకే శివకుమార్ నేతృత్వంలో రామనగర జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఇప్పటికే వినతి పత్రం సమర్పించారు.