ramanagara
-
కర్ణాటక: రామనగర జిల్లా ఇక బెంగళూరు సౌత్
బెంగళూరు: కర్ణాటక కేబినెట్ శుక్రవారం(జులై 26) కీలక నిర్ణయం తీసుకుంది. రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చారు. పేరు మార్పు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించినట్లు న్యాయ, శాసనసభా వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు.రామనగర జిల్లాలోని మాగడి, కనకాపుర, చెన్నపట్న,హరోహల్లి తాలూకాలు బ్రాండ్ బెంగళూరు వినయోగించుకోవడం కోసమే పేరు మార్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ పేరు మార్పు ఉంటుందని రామనగర జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత ఏడాదే వెల్లడించారు. జిల్లా పేరు మార్చాలని డీకే శివకుమార్ నేతృత్వంలో రామనగర జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఇప్పటికే వినతి పత్రం సమర్పించారు. -
వలపు వలలో చిక్కి.. వేధింపులు భరించలేకే!
రామనగర(కర్ణాటక): జిల్లాలోని లింగాయత్ మఠాధిపతి ఆత్మహత్య ఉదంతంలో విస్మయానికి గురి చేసే కోణం ఒకటి వెలుగు చూసింది. హనీట్రాప్‌లో చిక్కుకుని ఆ బ్లాక్‌మెయిలింగ్‌ను భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. రామనగర జిల్లా కంచుగల్ బండ్ మఠానికి చెందిన బసవలింగ స్వామిజీ(45).. తన పూజా మందిరంలో కిటికీ గ్రిల్‌కు ఉరేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనను పీఠాధిపతిగా తొలగించే యత్నాలు జరుగుతున్నాయని, ఆ వేధింపులను తట్టుకోలేకే తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్లో ఆయన పేర్కొన్నారు. ఈ నోట్ ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసుపై ఓ అంచనాకి వచ్చారు. అయితే.. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు.. ఇది హనీట్రాప్ కోణంతో ముడిపడి ఉందని గుర్తించారు. ఓ మహిళ సాయంతో ఆయన్ని అసభ్య కోణంలో చిత్రీకరించి.. ఆ వీడియోల ద్వారా ఆయనపై వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. వీడియోలో ఉన్న మహిళ ఎవరో తెలియదు.. కానీ, ఆమె వల్లే ఇదంతా అంటూ ఆయన లేఖలో రాసి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఓ మహిళతో ఆయన అభ్యంతరకర రీతిలో వీడియో కాల్ మాట్లాడినట్లు.. అందుకు సంబంధించిన మొత్తం నాలుగు వీడియోలను పోలీసులు గుర్తించారు. మహిళ తన ఫోన్లోని స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఆ వీడియోలను రికార్డ్ చేసినట్లు ఉంది. ఆ మహిళ ఎవరు? ఆ వీడియోల ద్వారా ఆయన్ని స్థానం నుంచి తప్పించాలనుకున్నారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక కన్నడనాట మఠాలపై, మఠాధిపతులపై రాజకీయ ప్రభావం ఉండడంతో.. ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేస్తామని వెల్లడించారు. నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న కంచుగల్ బండ్ మఠానికి బసవలింగ స్వామిజీ.. తన 20వ ఏట(1997లో) మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మధ్యే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి కూడా. -
ఆ చిత్రాలకు బానిస! నటించింది తన భార్యేమోనని..
బెంగళూరు: బూతు సినిమాలకు బానిసైన ఆ భర్త.. నీచ స్థితికి దిగజారాడు. తన భార్య క్యారెక్టర్ని అనుమానించి ఘోరానికి పాల్పడ్డాడు. పదిహేనేళ్లు కాపురం చేసిన భార్యను పిల్లల ఎదుటే కిరాతకంగా హతమార్చాడు. కర్ణాటకలో రామానగరలో ఈ ఘోరం చోటు చేసుకుంది. జహీర్‌పాషా(40) స్థానికంగా ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య ముబీనా, ఐదుగురు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. చాలాకాలంగా సెల్ఫోన్లో అభ్యంతరకర చిత్రాలు చూడడం అలవాటు చేసుకున్నాడు అతను. ఈ క్రమంలో.. రెండు నెలల కిందట చూసిన ఓ వీడియోలో ఉంది తన భార్య ముబీనా(35)నే అని అనుమానం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఆమెను క్రూరంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆమె ఆస్పత్రి పాలైంది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముబీనా తండ్రి ముందుకు రాగా.. భర్తను కటకటాల వెనక్కి నెట్టొద్దని ఆమె వేడుకుంది. దీంతో అతన్ని మందలించి వదిలేశారు. అయినా జహీర్ తీరు మారలేదు. ఆదివారం మధ్యాహ్న సమయంలో మరోసారి ఇద్దరి మధ్య ఈ విషయమై గొడవ జరిగింది. దీంతో పిల్లల ఎదుటే ఆమెను దారుణంగా హతమార్చాడు జహీర్. అది చూడగానే జహీర్‌పాషా పెద్ద కొడుకు.. దగ్గర్లో ఉన్న తాత గౌష్ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి విషయం చెప్పాడు. వాళ్లు వచ్చి చూసేసరికి కూతురు విగత జీవిగా పడి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న జహీర్‌పాషా కోసం గాలిస్తున్నారు. -
ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్
దొడ్డబళ్లాపురం: సురక్షిత పరికరాలు లేకుండా భూగర్భ డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వెళ్లిన ముగ్గురు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన రామనగర పట్టణంలో చోటుచేసుకుంది. హరీష్ అనే కాంట్రాక్టర్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్వహణను చూస్తుంటాడు. పట్టణ పరిధిలోని న్యూ నేతాజీ స్కూల్ వెనుక డ్రెనేజీలో సమస్య ఏర్పడింది. దీంతో మంజునాథ్ అనే వ్యక్తి ఇద్దరు కార్మి కులు, రాకేశ్‌లను బెంగళూరు నుంచి పిలిపించారు. శుక్రవారం మధ్యాహ్నం మ్యాన్‌హోల్‌లో దిగి పనులు చేస్తుండగా ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యారు. అగి్నమాపక సిబ్బంది, రామనగర పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తాళ్లతో బాధితులను బయటకు తీసి రామనగర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కేసు దర్యాప్తులో ఉంది. -
చికెన్ ధరలకు రెక్కలు
బెంగళూరు : మొన్నటి వరకూ చికెన్ ఉచితంగా ఇచ్చినా ముట్టుకోని జనం ఇప్పుడు చికెన్ కోసం ఎగబడుతున్నారు. దీంతో కేజీ చికెన్ ప్రస్తుతం రూ.200 ధర పలుకుతోంది. రామనగర జిల్లాలో లాక్డౌన్ ఉన్నప్పటికీ చికెన్, మటన్ విక్రయాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. శనివారం కేజీ రూ.180 ఉండగా ఆదివారం నాటికి రూ.200 దాటింది. అనేక చోట్ల కోళ్లు సరఫరా లేకపోవడం, కరోనా దెబ్బకు కోళ్లఫారాలు మూతబడడం వల్ల చికెన్‌కు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు నెల రోజులుగా సముద్రం చేపల సరఫరా ఆగిపోయింది. మంగళూరు, కారవార ప్రాంతాల నుండి బెంగళూరుకు వచ్చే సరుకు అక్కడి నుండి రామనగరకు వచ్చేది. ఇప్పుడు అడపాదడపా వస్తున్నా ఏంజెల్, పాంప్రెట్ తదితర చేపల ధర కేజీ రూ.1000 పలుకుతోంది. -
ఆ జిల్లా నుంచి గెలిస్తే సీఎం పదవి ఖాయం.. కానీ
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : రామనగర జిల్లా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎంత ఖాయమో, వారు ఐదేళ్లు అధికారంలో ఉండలేరనేది అంతే ఖాయమని మరోసారి రుజువయింది. మంగళవారం కుమారస్వామి అధికారం కోల్పోయిక ఈ విషయం మరోసారి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. కెంగల్ హనుమంతయ్య, రామక్రిష్ణహెగడె, హెచ్డీ దేవెగౌడ, ఇప్పుడు తాజాగా కుమారస్వామి. వీరంతా రామనగర జిల్లా నుండి ఎన్నికయినవారే. కానీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు అధికారావధి పూర్తి చేయలేకపోయారు. అంతేకాదు రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి రెండుసార్లు కూడా పూర్తి అధికారంలో ఉండలేకపోయారు. మాజీ ముఖ్యమంత్రులయిన కెంగల్ హనుమంతయ్య, రామక్రిష్ణహెగడె, హెచ్డీ దేవెగౌడ, హెచ్డీ కుమారస్వామి వీరంతా రామనగర నుండి ఎన్నికయ్యారు. మొదటిసారి బీజేపీతో జతకట్టి ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి 20 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్‌తో దోస్తీ చేసి 14 నెలలకే ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్నారు. రామనగర నివాసి అయిన కెంగల్ హనుమంతయ్య 1952, 57లో రామనగర నుండే ఎన్నికయ్యారు. ఈయన 4 సంవత్సరాల 5 నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అప్పట్లో సొంత పార్టీ కాంగ్రెస్‌కు చెందిన వారే ఈయనపై అవిశ్వాసం పెట్టారు. రామక్రిష్ణ హెగడె కేవలం 12 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేవెగౌడ 17 నెలలు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు. -
ఏడు పడగల పాము పొర...జనం ఏం చేశారంటే..
దొడ్డబళ్లాపురం : ఏడు పడగల పాము గురించి మనం సాధారణంగా సినిమాల్లో చూస్తాం లేదంటే కథల్లో వింటుంటాం..నిజానికి ఏడుపడగల పాము ఉందా. అంటే లేదు అని ఖచ్చితంగా చెప్పలేము..ఉందా? అంటే ఉందని సాక్ష్యాలూ చూపలేము..అది నమ్మిన వారికి నిజం, నమ్మనివారికి కట్టుకథ... ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటారా.. రామనగర జిల్లా కనకపుర తాలూకా కోడిహళ్లి గ్రామం సమీపంలో ఏడుపడగల పాముకు చెందినదిగా చెప్పబడుతున్న పాము పొరకు జనం సాక్ష్యాత్ నాగదేవతగా భావించి పూజలు చేసేస్తున్నారు. గత మూడు రోజుల క్రితం గ్రామం సమీపంలో స్థానికులకు కనిపించిన పాము పొర ఏడు పడగలను కలిగి ఉంది. దీంతో సమాచారం అందుకున్న గ్రామస్తులు అదో మహత్యంగా భావించి పూజలు ప్రారంభించారు. సమీపంలోనే పాము పుట్ట కూడా ఉండడంతో జనం నమ్మకాలకు ఊతమిచ్చినట్టయింది. విషయం కాస్త పక్క గ్రామాలకూ తెలిసి జనం తండోపతండాలుగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. 6 నెలల క్రితం దగ్గరలోని కోటెకొప్పఅనే గ్రామం నివాసి దొడ్డకెంపేగౌడ అనే వ్యక్తికి ఏడుపడగల పాము కనిపించినట్టు చెప్పుకున్నాడు. అప్పుడు దగ్గరలో పనిచేస్తున్న కొందరితో ఏడుపడగల పాము పోతోంది చూద్దురు రండి అంటూ పిలిచాడట. అయితే అప్పుడు పాము కనిపించలేదట. ఇప్పుడు వారి నమ్మకాలను బలపరిచేలా ఏడుపడగలు గల పాము పొర కనిపించడంతో జనం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పూజలు చేస్తున్నారు. -
సీఎం..కేరాఫ్ రామనగర
ఒక జిల్లా నుంచి ఒకరు కాదు, ఇద్దరు కాదు.. నలుగురు ముఖ్యమంత్రులు కావడం యాదృచ్ఛికం కావచ్చు, అయినా అది విశేషమే కదా. బెంగళూరు సమీపంలోని రామనగర జిల్లా ఈ ఖ్యాతిని సంపాదించుకుంది. తాజాగా సీఎం కాబోయే జేడీఎల్పీ నేత కుమారస్వామి ఈసారి రామనగర నుంచి గెలవడం తెలిసిందే. కర్ణాటక, దొడ్డబళ్లాపురం: రాష్ట్రానికి రామనగర జిల్లా మరోసారి ముఖ్యమంత్రిని అందించిన కీర్తిని దక్కించుకుంది. తాజాగా జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామితో కలిపి రామననగర జిల్లా నుండి ఎన్నికయిన ఎమ్మెల్యేలు మొత్తం నలుగురు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు. జిల్లాలో మాగడి నియోజకవర్గం మినహా కనకపుర, రామనగర, చెన్నపట్టణ నియోజకవర్గాల నుండి ఎన్నికయిన ఎమ్మెల్యేలు రాష్ట్రానికి ముఖ్యమంత్రులయ్యారు. కెంగల్ హనుమంతయ్య నాంది మైసూరు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రం 2వ ము ఖ్యమంత్రిగా ఎన్నికయిన ప్రముఖ వ్యక్తి కెంగల్ హ నుమంతయ్య.ఆయన అప్పట్లో రామనగర నుండి ఎన్నికయ్యారు. 1952 నుండి 1956 వరకూ ఆయన రాష్ట్ర ము ఖ్యమమంత్రిగా పనిచేశారు. ఈయన తరువాత సుమా రు మూడున్నర, నాలుగు దశాబ్దాల పా టు రామనగర నుంచి ఎవరూ సీఎం కుర్చీని అందుకోలేదు. దేవేగౌడ వంతు వరుసగా ఓటమి పాలవుతూ రాజకీయ భవిష్యత్తు కో సం ఎదురు చూస్తున్న హెచ్డీ దేవేగౌడ 1994లో జరిగి న అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థిగా రామనగర నుండి పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడే ఆయ న ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం 172 రోజుల పా టు రాష్ట్రాన్ని పాలించారు. తరువాత నాటకీయ పరిణా మాలతో ఆయన దేశ ప్రధానిగా అందలమెక్కారు. రామకృష్ణ హెగ్డే ఇలా 1983లో ముఖ్యమంత్రి అయిన రామకృష్ణ హెగ్డే చట్టసభ సభ్యుడు కాకపోవడంతో ఎమ్మెల్యే, లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి వచ్చింది. అప్పట్లో కనకపుర ఎమ్మెల్యే పీజీ ఆర్ సింధ్యా చేత రాజీనామా ఇప్పించి రామకృష్ణ హెగ్డే పోటీ చేసి గెలిచారు. కుమారస్వామి అదృష్టం తరువాత 2004లో దేవేగౌడ కుమారుడు హెచ్డీ కుమారస్వామి ఎన్నికల్లో మొదటిసారిగా రామనగర నుండి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు చోటుచేసుకున్న కారణంగా అదృష్టం తన్నుకొచ్చి కుమారస్వామి ముఖ్యమంత్రి గద్దెనెక్కారు. ఒక సంవత్సరం 253 రోజుల పాటు పదవిలో ఉన్నారు. ఈసారి ఏమవుతుందో..? ఈ దఫా రామనగరతో పాటు మొదటిసారిగా చెన్నపట్టణ నుండి పోటీ చేసి కుమారస్వామి గెలుపొందా రు. ఆయన రామనగర స్థానానికి రాజీనామా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నిజానికి చెన్నపట్టణలో ప్రజలు కుమారస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటిం చడం వల్లే గెలిపించారని చెప్పవచ్చు. ఏది ఏమైనా రామనగర అనేది కేరాఫ్ ముఖ్యమంత్రిగా మారింద ని జిల్లా ప్రజలు ఆనందంగా చెప్పుకుంటున్నారు. -
ఆశపడింది.. దొరికిపోయింది!
రామనగర: నెల రోజులుగా రామనగర తాలూకా అరేహళ్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు గురువారం ఉదయం బోనులో చిక్కుకుంది. గ్రామస్తులు అధికారులకు విషయాన్ని తెలిపారు. స్పందించిన అటవీ అధికారులు అరేహళ్లి గ్రామం శివారులో మరి చిక్కగౌడ అనే రైతుకు చెందిన మామిడి తోటలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కిపోయింది. కట్టేసిన మేకను తినడానికి వచ్చిన చిరుత దొరికిపోయింది. ఈ ప్రాంతంలో ఈ ఏడాదిలో పట్టుబడిన రెండో చిరుతపులి ఇది. చిరుత చిక్కడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుత నెల రోజులుగా రాత్రిళ్లు గ్రామాల్లో ప్రవేశించి మేకలు, కుక్కలను ఎత్తుకెళుతోంది.