
ఆశపడింది.. దొరికిపోయింది!
నెల రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేసిన చిరుతుపులి ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు.
కట్టేసిన మేకను తినడానికి వచ్చిన చిరుత దొరికిపోయింది. ఈ ప్రాంతంలో ఈ ఏడాదిలో పట్టుబడిన రెండో చిరుతపులి ఇది. చిరుత చిక్కడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుత నెల రోజులుగా రాత్రిళ్లు గ్రామాల్లో ప్రవేశించి మేకలు, కుక్కలను ఎత్తుకెళుతోంది.