
మొన్నటి వరకూ చికెన్ ఉచితంగా ఇచ్చినా ముట్టుకోని జనం ఇప్పుడు చికెన్ కోసం ఎగబడుతున్నారు.
బెంగళూరు : మొన్నటి వరకూ చికెన్ ఉచితంగా ఇచ్చినా ముట్టుకోని జనం ఇప్పుడు చికెన్ కోసం ఎగబడుతున్నారు. దీంతో కేజీ చికెన్ ప్రస్తుతం రూ.200 ధర పలుకుతోంది. రామనగర జిల్లాలో లాక్‌డౌన్ ఉన్నప్పటికీ చికెన్, మటన్ విక్రయాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. శనివారం కేజీ రూ.180 ఉండగా ఆదివారం నాటికి రూ.200 దాటింది. అనేక చోట్ల కోళ్లు సరఫరా లేకపోవడం, కరోనా దెబ్బకు కోళ్లఫారాలు మూతబడడం వల్ల చికెన్‌కు డిమాండ్ ఏర్పడింది.
మరోవైపు నెల రోజులుగా సముద్రం చేపల సరఫరా ఆగిపోయింది. మంగళూరు, కారవార ప్రాంతాల నుండి బెంగళూరుకు వచ్చే సరుకు అక్కడి నుండి రామనగరకు వచ్చేది. ఇప్పుడు అడపాదడపా వస్తున్నా ఏంజెల్, పాంప్రెట్ తదితర చేపల ధర కేజీ రూ.1000 పలుకుతోంది.