ఎంతో చరిత్ర కల్గిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పొలిటికల్ డిఫెన్స్‌లో పడింది. ప్రస్తుతం ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కాంగ్రెస్ అయోమయంలో పడింది. ప్రధానంగా చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందాలపై వస్తున్న విమర్శలతో కాంగ్రెస్ పార్టీ రక్షణాత్మక ధోరణితో ముందుకెళ్తోంది. ఇటీవల బెంగళూరులో చంద్రబాబుతో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ మంతనాలు జరపడంతో కాంగ్రెస్ పార్టీ అందుకు వివరణలు ఇచ్చుకోవడమే ఇందుకు ఉదాహరణ.
‘మతతత్వ బీజేపీతో మాది రాజీలేని పోరాటం. టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. బీజేపీతో కలిసి నడుస్తోంది వైసీపీ. ఏపీలో ఈ నాలుగు పార్టీలకు వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమి పార్టీలతో కలిసి పోరాడుతాం’ అని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ వివరణ ఇచ్చుకున్నారు.
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పూర్తిస్థాయిలో చంద్రబాబు సహకారం అందించగా, కాంగ్రెస్‌ను గెలిపించేందుకు తెలంగాణ బరిలో టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు పోటీకి పెట్టలేదు. దీన్ని సాకుగా చూపుతూ చంద్రబాబు.. తెలంగాణలో తాను చేసిన సాయానికి బదులుగా ఏపీలో సాయం చేయాలని శివకుమార్‌ను కోరారు. చంద్రబాబు అభ్యర్థనల మేరకు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలను తీసుకున్నారు డీకే శివకుమార్,
తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని గతంలో ప్రకటించిన షర్మిల.. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి ఏపీలో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించేందుకు రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. సామాజిక వర్గాలు ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థులను తెలుగుదేశంకు అనుకూలంగా బరిలో దించేందుకు అధిష్టానం ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment