పొలిటికల్‌ ఎంట్రీపై డీకేశివకుమార్‌ కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు | Dk Shivakumar Daughter Ishwarya Comments On Entry In To Politics | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ ఎంట్రీపై డీకేశివకుమార్‌ కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు

Published Fri, Apr 26 2024 6:46 PM | Last Updated on Fri, Apr 26 2024 7:03 PM

Dk Shivakumar Daughter Ishwarya Comments On Entry In To Politics

బెంగళూరు: రాజకీయ రంగ ప్రవేశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్య స్పందించారు. లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో భాగంగా ఐశ్వర్య శుక్రవారం(ఏప్రిల్‌26​)  బెంగళూరులో ఓటు వేశారు.  ఈ సందర్భంగా  ఆమె మీడియాతో మాట్లాడారు.

తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు ఐశ్వర్య. ‘నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ లేదు. నేను విద్యాసంస్థలు నడుపుతున్నాను. దేశం గర్వపడేలా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు వారి వారి రంగాల్లో పనిచేయాలి.

బెంగళూరు రూరల్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన బాబాయి డీకే సురేష్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపారు. కాగా, 2019 ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా గెలిచింది డీకే సురేష్‌ ఒక్కరే కావడం గమనార్హం. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 ఎంపీ సీట్లలో బీజేపీ ఏకంగా 25 సీట్లు గెలుచుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement