బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో, అభ్యర్థుల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలోకి దిగారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంది.
ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల నేతలు ప్రచారంలోకి వెళ్తున్నారు. ఈ సందర్బంగా నేతలపై ఎన్నికల సంఘం అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రయాణించిన ఛాపర్‌లో ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఛాపర్‌లోని ప్రథమ చికిత్స కిట్‌ను, బ్యాగులను ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రచారం కోసం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థలికి చేరుకున్న తర్వాత.. హెలిప్యాడ్‌లోనే శివకుమార్ ప్రయాణించిన ఛాపర్‌ను అధికారులు చెక్ చేశారు. ఈ సందర్బంగా ఛాపర్‌లో శివకుమార్ భార్య, పిల్లలు ఉన్నారు.
ఈ సందర్బంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ.. సోదాలు చేయడంలో తప్పులేదని, వాళ్లు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. మంజునాథ స్వామిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. అందుకే నా కుటుంబంతో ఇక్కడికి వచ్చాను. ఆయన నన్ను, రాష్ట్రాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా పర్యటన తర్వాత ధర్మస్థలంలో ప్రచారం చేస్తాను అని కామెంట్స్ చేశారు.
Flying squad of #ECI and officials conducted a check of the #helicopter used by State #Congress president #DKShivakumar after it reached the helipad at #Dharmasthala in Dakshina Kannada. The party's state chief was travelling in the chopper. #BreakingNews pic.twitter.com/lKizduypGt
— Headline Karnataka (@hknewsonline) April 22, 2023
Comments
Please login to add a commentAdd a comment