బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయోత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు ఇప్పుడు పెద్ద టాస్క్ వచ్చి పడింది. అదే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలి అని. సీఎం రేసులో సీనియర్ నేత సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇద్దరి పేర్లే మొదటి నుంచి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరికి వాళ్లు అధిష్టానం చూపు తమపైనే ఉందంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో..
కర్ణాటకలో కొత్త సర్కార్ కొలువు దీరడానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ సాయంత్రం ప్రస్తుత సీఎం బొమ్మై తన రాజీనామాను గవర్నర్‌ను కలిసి సమర్పిస్తారు. ఎల్లుండి(మే 15వ) బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే యోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే.. అదేరోజు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పుట్టినరోజు కూడా.
ఈ సందర్భంగా గతంలో డీకే శివకుమార్ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే.. తన పుట్టినరోజునాడు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తనకు గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చారని డీకే ప్రకటించారు. దీంతో.. తన పుట్టినరోజు నాడే కొలువుదీరనున్న కొత్త సర్కార్‌లో డీకే శివకుమార్ స్థానం ఏమై ఉండొచ్చని?.. అధిష్టానం ఆయనకు ఏం గిఫ్ట్ ఇస్తుందనే చర్చ మొదలైంది కన్నడనాట. రేపు(ఆదివారం) సీల్పీ భేటీలో సీఎల్పీ నేతలను ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం ఉండగా.. సీఎం ఎంపికపైనా సాయంత్రకల్లా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
‘‘మద్దతుదారులంతా నన్నే సీఎం కావాలని కోరుకుంటున్నారా?(మీడియాను ఉద్దేశించి). నాకంటూ ప్రత్యేకించి మద్దతుదారులంటూ ఎవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ అంతా నాకు అండగా ఉంది. ఈ విజయం అందరి సమిష్టి విజయం. సోనియా, రాహుల్ గాంధీలకు ఈ విజయం అంకితం’’: సీఎం అభ్యర్థి రేసుపై డీకే తాజా స్పందన
ఇదీ చదవండి: 'జై బజరంగబలి' మా వెంటే ఉన్నాడు!: కాంగ్రెస్
Comments
Please login to add a commentAdd a comment