బెంగళూర్ : మనీల్యాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ జ్యుడిషియల్ కస్టడీని ఈనెల 15 వరకూ పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తీహార్ జైలులో డీకేను ప్రశ్నించేందుకు ఈడీని కోర్టు అనుమతించింది. డీకే శివకుమార్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలన్న ఈడీ అభ్యర్ధనను కోర్టు సమ్మతించింది. అస్వస్థతతో డీకే శివకుమార్ ఆస్పత్రిలో ఉన్నందున ఆయనను సరిగ్గా ప్రశ్నించలేదని ఈడీ న్యాయవాదులు అమిత్ మహజన్, ఎన్‌కే మట్టా, నితీష్ రాణాలు కోర్టుకు తెలపగా, ఈనెల 4, 5 తేదీల్లో జైలులో డీకేను ప్రశ్నించేందుకు న్యాయస్ధానం అనుమతించింది. తమ క్లైంట్‌ను ప్రశ్నించేందుకు ఈడీ అభ్యర్ధనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని డీకే శివకుమార్ న్యాయవాది సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్ స్పష్టం చేశారు. బెయిల్‌పైఘున్న సందర్భంలోనూ దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు నిందితుడు సిద్ధమేనని చెప్పుకొచ్చారు. పన్ను ఎగవేత, హవాలా లావాదేవీల ఆరోపణలపై డీకే శివకుమార్‌పై దర్యాప్తు సంస్థలు చార్జిషీట్ దాఖలు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment