
న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో అరెస్టైన సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దర్యాప్తు సంస్థ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయవచ్చని భావిస్తున్నారు. డీకే శివకుమార్ సాక్ష్యాలను తారుమారు చేస్తారని, లేదా పారిపోయే అవకాశం ఉందనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కైత్ వ్యాఖ్యానించారు.
కీలక పత్రాలన్నీ దర్యాప్తు సంస్థల వద్ద ఉన్నందున డీకే శివకుమార్ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదని పేర్కొన్నారు. రూ 25 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై అదే మొత్తానికి ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీపై డీకే శివకుమార్‌ను విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment