
కర్ణాటక: రామనగర జిల్లా నుండి మీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయండి అంటూ డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం రామనగరలో ప్రచారం చేసిన డీకే శివకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చేయాలనేది తన కల అని, రామనగర ప్రజలు ఎన్నికల్లో గెలిపించిన కెంగల్ హనుమంతయ్య, దేవెగౌడ, రామకృష్ణహెగడె చివరకు కుమారస్వామి అందరూ ముఖ్యమంత్రులయ్యారన్నారు.
అలాంటిది మీ ఇంటి బిడ్డ ముఖ్యమంత్రి కాకూడదా అన్నారు. నిఖిల్ కుమారస్వామి ఇంకా యువకుడని, అతడ్ని కావాలంటే వచ్చే రోజుల్లో ఎప్పుడయినా గెలిపించవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment