బెంగుళూరు : కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. సోమవారం రాత్రి ఆయనకు ఛాతీనొప్పి రావడంతో బెంగుళూరులోని ఆసుపత్రికి తరలించారు. అయితే నవంబర్ మొదటి వారంలోనే శివకుమార్‌కు హైబీపీ(అధిక రక్తపోటు) రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఇటీవలే తిరిగి తన నివాసానికి చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో తీహార్ జైలు నుంచి అక్టోబర్ 23న విడుదల అయ్యారు. ఈ సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ పండ్లమాలలతో ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఇక బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం శివ కుమార్ మైసూర్‌లోని వివిధ దేవాలయాలు, మఠాలను సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment