
మాట్లాడుతున్న అనూహ్యరెడ్డి
హిమాయత్‌నగర్: వివాహం చేసుకునేందుకు ఆర్థిక స్థోమత లేని అభాగ్యులకు ‘కోవిధ సహృదయ ఫౌండేషన్’ చేయూతనందిస్తోంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ నెలలో వంద జంటలకు ఉచితంగా వివాహాలు చేసేందుకు సిద్ధమైనట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జి.అనూహ్యరెడ్డి తెలిపారు. గురువారం హిమాయత్‌నగర్‌లో ఆమె మాట్లాడుతూ.. బలహీనవర్గాల వారి కి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు.
వధూవరులకు సంబంధించిన ఇరువర్గాల వారు మాట్లాడుకుని అంతా సిద్ధం అనుకుంటే తాము నిర్వహిం చే సామూహిక పద్ధతిలో ఈ వివాహాలను జరిపిస్తామన్నారు. 100 జంటలకు వివాహా లు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నా మ న్నారు. పెళ్లి ఖర్చులన్నీ తామే భరిస్తామన్నారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఇరువర్గాల వారికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వివరాలకు 86885 18655, 88850 03969లకు ఫోన్ చేసి ఈ నెల 25లోపు పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment