Anuhya
-
చక్రి కుటుంబానికి నిర్మాత సాయం
సాక్షి, హైదరాబాద్ : లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వివిధ వర్గాల పేదలను ఆదుకునేందుకు సామాజిక బాధ్యతగా అనేక సంస్థలు సేవలు అందిస్తూ స్ఫూర్తినిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘కోవిద సహృదయ ఫౌండేషన్’ అరుదైన సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు, సినీ కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాత డాక్టర్ అనూహ్యా రెడ్డి ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, కోడిగుడ్లు, ప్యాకేజ్డ్ ఆహారాన్ని పేదలకు అందజేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మోహిత్, వారి తల్లి మణికొండలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలియడంతో వారికి రెండు నెలలకు సరి పడా మందులు, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా అనుహ్యా రెడ్డి మాట్లాడుతూ.. ‘సాయం అందించినందుకు చాలా సంతోషంగా ఉందని మహిత్ అన్నారు. కానీ తనకు ఒక పని ఇప్పించాలని కోరారు. దీంతో నేను కరోనాపై ఓ ట్యూన్ చేయాలని మహిత్‌ను కోరాను. మహిత్ది చాలా మంచి మనసు’ అని తెలిపారు. మహిత్ మాట్లాడుతూ.. తన పనిని చూసి ఎంకరేజ్ చేయాలని కోరారు. తను ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు చేశానని చెప్పారు. ఓ సోదరిగా అనుహ్యా రెడ్డి ఇచ్చిన భరోసా తన హృదయాన్ని కదిలించిందని తెలిపారు. అలాగే కృష్ణానగర్ , మూసాపేట్ ప్రాంతాల్లోని 150 మంది ట్రాన్స్ జెండర్లకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం చేశారు. -
కల్యాణం జరిపిస్తాం రండి
హిమాయత్‌నగర్: వివాహం చేసుకునేందుకు ఆర్థిక స్థోమత లేని అభాగ్యులకు ‘కోవిధ సహృదయ ఫౌండేషన్’ చేయూతనందిస్తోంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ నెలలో వంద జంటలకు ఉచితంగా వివాహాలు చేసేందుకు సిద్ధమైనట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జి.అనూహ్యరెడ్డి తెలిపారు. గురువారం హిమాయత్‌నగర్‌లో ఆమె మాట్లాడుతూ.. బలహీనవర్గాల వారి కి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. వధూవరులకు సంబంధించిన ఇరువర్గాల వారు మాట్లాడుకుని అంతా సిద్ధం అనుకుంటే తాము నిర్వహిం చే సామూహిక పద్ధతిలో ఈ వివాహాలను జరిపిస్తామన్నారు. 100 జంటలకు వివాహా లు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నా మ న్నారు. పెళ్లి ఖర్చులన్నీ తామే భరిస్తామన్నారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఇరువర్గాల వారికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వివరాలకు 86885 18655, 88850 03969లకు ఫోన్ చేసి ఈ నెల 25లోపు పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. -
‘అనూహ్య’ తీర్పు
సర్వత్రా హర్షం దోషి చంద్రభాన్కు ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు ప్రజల మనోభావాలకు అద్దం పట్టిన తీర్పు తాము అనుకున్న తీర్పే ప్రకటించారన్న అనూహ్య తల్లిదండ్రులు గారాబంగా పెంచుకున్న కూతురు కసాయి చేతిలో చిక్కుకుని దారుణ హత్యకు గురైతే ఆ కుటుంబ సభ్యుల క్షోభ వర్ణనాతీతం. చేయి పట్టుకు నడిచిన కూతురు ఊరు కాని ఊరులో హత్యకు గురికావడం.. ఫిర్యాదు చేస్తే పోలీసుల నుంచే ఈసడింపులు ఎదురవటంతో ఆ తండ్రి పడిన బాధ వర్ణనాతీతం. ఎట్టకేలకు కోర్టు తీర్పుతో ఆ.. వేదనకు, ఆవేదనకు కాస్తంత ఊరట. ఎస్తేరు అనూహ్య కేసులో దోషిగా నిర్ధారించిన చంద్రభాన్కు కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పునివ్వటం సమాజంలో ఇలాంటి మానవ మృగాలకు హెచ్చరికలా ఉందని సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మచిలీపట్నం : దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఎస్తేరు అనూహ్య హత్య కేసులో నిందితుడికి ముంబై సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం కోర్టు వెలువరించిన తీర్పు ప్రజల మనోభావాలకు అద్దం పట్టినట్లుగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. తాము పైకి చెప్పకున్నా తామనుకున్న తీర్పును కోర్టు ప్రకటించిందని అనూహ్య తల్లిదండ్రులు జోనాథన్ ప్రసాద్, జ్యోత్స్న తెలిపారు. అయినా తమ కుమార్తె జ్ఞాపకాలు తమను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఆ కన్నీళ్లకు వెలకట్టేదెవరు? తమతో కలిసి క్రిస్మస్ పండుగ చేసుకుని ఉద్యోగం నిమిత్తం ముంబై వెళ్లేటప్పుడు.. నాన్నా పెళ్లి సంబంధాలు చూడండని, తాను వేసుకునే పెళ్లి గౌను ఇలా ఉండాలని చెప్పి వెళ్లిన ఒకటి, రెండు రోజుల తరువాత ఆమె విగత జీవిగా మారితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. పోలీసులు సహకరించకున్నా బంధువుల సాయంతో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కుమార్తె ఆచూకీని కనుగొన్న ఆ తండ్రి కన్నీళ్లకు వెలకట్టలేం. ఆ కుటుంబానికి జరిగిన లోటు పూడ్చలేనిది. మచిలీపట్నానికి చెందిన శింగవరపు ఎస్తేరు అనూహ్య (25) ముంబైలో దారుణ హత్యకు గురి కావడం, పోలీసులు నిందితుడి ఆచూకీని కనుగొనడం, సాక్ష్యాలు సేకరించటం, 2500 మందిని విచారించడం, తాజాగా దోషిగా నిర్ధారించిన చంద్రభాన్కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. -
అనూహ్య కేసులో రేపు శిక్ష ఖరారు
సాక్షి, ముంబై: తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రబాన్‌కు శిక్ష ఖరారును ముంబై సెషన్స్ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదావేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు శుక్రవారం వెలువడే అవకాశముంది. 2014 జనవరి అయిదో తేదీన లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మినస్ నుంచి అదృశ్యమైన ఎస్తేర్ అనూహ్య 2014 జనవరి 16వ తేదీన కంజూర్‌మార్గ్ -భాండూప్ మధ్యలో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన చంద్రబాన్ సానప్ అలియాస్ లౌక్యాను మంగళవారం కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో బుధవారం చంద్రబాన్‌కు కోర్టు శిక్ష ఖరారు చేస్తుందని భావించారు. అయితే ఈ కేసుకు సంబంధించి సెషన్స్‌కోర్టులో బుధవారం ఉదయం సుమారు 11.30 గంటల నుంచి ఇరు పక్షాల తుది వాదనలు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రభుత్వ న్యాయవాది రాజన్ ఠాక్రే తన వాదనను విన్పించారు. అనూహ్య హత్య కేసులో దోషిగా నిర్ధారణ అయిన చంద్రబాన్‌కు మరణశిక్ష విధించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాన్ ఉద్దేశపూర్వకంగానే క్రూరంగా అనూహ్యను హత్య చేసినట్టు పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో గతంలో హైకోర్టులతోపాటు సుప్రీం కోర్టు మరణశిక్షలు విధించినట్టు తెలిపారు. అయితే నిందితుడు తన తప్పు తెలుసుకుని మారాలనుకుంటున్నాడని, శిక్ష తగ్గించాలని డిఫెన్స్ న్యాయవాది ప్రకాష్ సలసింగ్కర్ వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న అనంతరం సెషన్‌కోర్టు న్యాయమూర్తి వీవీ జోషి 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం అనూహ్య బంధువైన అరుణ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఇంత త్వరగా కోర్టు నిందితున్ని దోషిగా ప్రకటిస్తూ తీర్పునివ్వడం ఆనందం కలిగించిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషికి మరణశిక్ష విధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
22 నెలలు!
ఎస్తేరు అనూహ్య హత్య కేసు కొలిక్కి.. టాక్సీ డ్రైవర్ చంద్రభానే దోషి ముంబై కోర్టు తీర్పుతో బందరులో కలకలం మచిలీపట్నం : బందరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరు అనూహ్య (23) హత్యకేసులో చిక్కుముడి వీడింది. 22 నెలల అనంతరం ఈ కేసులో ముంబై కోర్టు తీర్పు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు నిందితుడిగా అనుమానిస్తున్న టాక్సీ డ్రైవర్ చంద్రభాన్నే దోషిగా తేల్చారు. బుధవారం అతడికి శిక్షను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నానికి చెందిన శింగవరపు జోనతాన్ ప్రసాద్ కుమార్తె ఎస్తేరు అనూహ్య ముంబైలోని టీసీఎస్ కార్యాలయంలో ఇంజినీరు. ఆమె 2013 డిసెంబరులో క్రిస్మస్ వేడుకలు జరుపుకొనేందుకు బందరు వచ్చారు. 2014 జనవరి నాలుగున విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ముంబై బయలుదేరి వెళ్లారు. అక్కడి ఎల్టీటీ స్టేషన్లో రైలు దిగిన ఆమెను ట్యాక్సీ డ్రైవర్ చంద్రభాన్ మాయమాటలు చెప్పి వెంట తీసుకువెళ్లాడు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. జనవరి 16వ తేదీన బాండూస్లోని ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ రహదారి సమీపంలో అనూహ్య మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం 18వ తేదీన మృతదేహాన్ని మచిలీపట్నం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత అనూహ్య హత్యకేసులో నిందితులను శిక్షించాలని కోరుతూ పెద్దఎత్తున ఉద్యమాలు జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో 22 నెలల తర్వాత ఈ హత్యకేసులో చంద్రభాన్‌ను ముంబై కోర్టు దోషిగా నిర్ధారించింది. శిక్ష.. భయం గొలిపేలా ఉండాలి ముంబై కోర్టు తీర్పు నేపథ్యంలో అనూహ్య తండ్రి జోనతాన్ ప్రసాద్ మంగళవారం బందరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగించడం వల్లే పోలీసులు స్పందించారని తెలిపారు. 22 నెలల్లో దోషిని నిర్ధారించడం న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందన్నారు. నిందితుడు చంద్రభాన్కు కోర్టు విధించే శిక్ష నేరప్రవృత్తి ఉన్న వారికి భయం గొలిపేలా ఉండాలని సూచించారు. మీడియా, ప్రజాప్రతినిధుల సహకారం వల్లే తన కుమార్తె హత్య కేసు ఓ కొలిక్కి వచ్చిందన్నారు. ముంబైకి చెందిన జోన్-7 డీసీపీ వెంకట్‌పాటిల్ దర్యాప్తు అంశాలను తనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేవారని వివరించారు. - జోనతాన్ ప్రసాద్, అనూహ్య తండ్రి -
అనూహ్య హత్య కేసు: చంద్రభాన్ దోషిగా నిర్ధారణ
-
పరిమళించిన మానవత్వం...
⇒ అనూహ్యకు వైద్య ఖర్చుల కోసం రూ.4 లక్షలు సాయం ⇒ ప్రకటించిన ‘మా-ఆసరా’ సంస్థ బంజారాహిల్స్: ‘అయ్యో పాపం.. అనూహ్య’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు పలువురు స్పందించి అనూహ్య వైద్య ఖర్చుల కోసం ముందుకొచ్చారు. శనివారం అనూహ్యను కబలిస్తున్న వ్యాధిపై సాక్షి ప్రచురించిన కథనానికి స్పందించి చిన్నారి తల్లిదండ్రులకు పలువురు ఫోన్ చేసి భరోసానిచ్చారు. బంజారాహిల్స్‌కు చెందిన మా-ఆసరా స్వచ్ఛంద సంస్థ తరపున అనూహ్య వైద్య ఖర్చుల కోసం రూ. 4 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు దేశరాజు మాలతి మాట్లాడుతూ చిన్నారి వైద్య ఖర్చుల కోసం తమ సంస్థలో ఉన్న 500 మంది సభ్యులు స్పందించి ఈ మేరకు డబ్బులు పోగు చేసినట్లు తెలిపారు. ఈ సహాయం ఇంతటితో ఆగదని చిన్నారికి బాగయ్యేంత వరకు స్పందిస్తూనే ఉంటామని ఆమె తెలిపారు. -
ఆత్రేయ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
'అనూహ్య' కథనాలు
-
‘అనూహ్య’ కథనాలు
కలవరపెడుతున్న ముంబై పోలీసుల తీరు అత్యాచారం చేశారంటూ గత ప్రచారం ఇప్పుడు దొంగతనం కోసం హత్య చేసినట్టు కథనం ముంబై పోలీసులు కేసు పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆరోపణలు అనూహ్య కేసులో ముంబై పోలీసులు కట్టుకథలు వినిపిస్తున్నారా? దర్యాప్తు ఏదోరకంగా అయ్యిందనిపించి చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నారా? మొదట్నుంచీ విమర్శలకు తావిస్తున్న వారి తీరు తాజాగానూ అలాగే ఉంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఇప్పుడు పాత నేరస్తుడిని అరెస్టు చూపించారన్న విమర్శలు రేగుతున్నాయి. సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య (23) హత్య కేసులో ముంబై పోలీసులు మొదట్నుంచీ అపవాదులనే మూటగట్టుకుంటున్నారు. మిస్టరీగా మారిన అనూహ్య హత్య కేసులో ఏదో ఒకరకంగా దర్యాప్తు అయ్యిందనిపించి చేతులు దులిపేసుకునే ప్రయత్నం జరిగిందా అనే అనుమానాలకు పోలీసులు చెబుతున్న కథనాలే ఊతమిస్తున్నాయి. అనూహ్య సామూహిక అత్యాచారానికి గురైందంటూ గతంలో మీడియాకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పెద్ద కలకలమే రేగింది. తాజాగా దొంగతనం కోసం ఆమెను హత్య చేశారంటూ కొత్త కథనం ప్రచారంలోకి తెచ్చారు. ఏదో సాకు చూపి అనూహ్య హత్య కేసును త్వరగా మూసివేయాలన్న తాపత్రయంతోనే ఇదంతా చేస్తున్నారని జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. అనూహ్య హత్య కేసులో ముంబై పోలీసులు చెబుతున్న కథనాలను ఆమె తండ్రి శింగవరపు జోనాథన్ ప్రసాద్ ఖండిస్తున్నారు. ఒంటరిగా బైక్ పై వెళుతుందా..? తాజాగా అనూహ్య హత్య కేసులో నిందితుడిగా పేర్కొంటూ నాసిక్‌కు చెందిన చంద్రభాను సాసప్ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ముంబైలోని ఖిల్లా కోర్టులో హాజరుపర్చడంతో అతనికి 15 రోజులు రిమాండ్ విధించారు. అతన్ని అరెస్టు చూపించిన పోలీసులు అనూహ్య కేసును మూసివేసేందుకు ఆతృత చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనవరి 5న రైల్వే స్టేషన్లో దిగిన అనూహ్యను మోటార్ బైక్‌పై తీసుకుని వెళ్లి దొంగతనం కోసం హత్య చేశాడని ముంబై పోలీసులు చెప్పిన కథనం నమ్మశక్యంగా లేదు. ఒంటరిగా వచ్చిన యువతి క్యాబ్ ఎక్కకుండా మోటార్ బైక్ ఎందుకు ఎక్కుతుందనే ప్రశ్నకు ముంబై పోలీసుల వద్ద సమాధానం లేదు. జనవరి 16న అనూహ్య మృతదేహం లభ్యంకావడంతో హత్యకేసుగా నమోదుచేసిన పోలీసులు దాదాపు 47 రోజులుగా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ముంబై పోలీసులు మూడు బృందాలు, క్రైం బ్రాంచి రెండు బృందాలు హైదరాబాద్, మచిలీపట్నం, విజయవాడ ప్రాంతాల్లో దర్యాప్తు నిర్వహించాయి. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ వద్ద లభించిన సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో అనూహ్య స్నేహితుడు హేమంత్ (హైదరాబాద్)ను ముంబై పిలిచి మరీ విచారణ చేశారు. సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌లో ఉన్నవారిని, క్యాబ్ డ్రైవర్లను ఇలా రోజులతరబడి వందలాది మందిని విచారించారు. చివరకు ఏదో రకంగా ఈ కేసును మూసివేసేందుకు పాత నేరస్తుడిని అరెస్టు చూపించారన్న విమర్శలు రేగుతున్నాయి. తన కుమార్తె హత్య కేసును కట్టుకథలతో మూసివేసే ప్రయత్నాలు చేస్తున్నారని అనూహ్య తండ్రి ప్రసాద్ మరోమారు ముంబై పోలీసులపై విమర్శలు చేయడం గమనార్హం. -
అనూహ్య హత్యకేసు వివరాలు వెల్లడి
ముంబై: సంచలనం సృష్టించిన సాప్ట్వేర్ ఇంజనీర్ సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసు వివరాలను ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా ఈరోజు వెల్లడించారు. విజయవాడ నుంచి జనవరి 4న లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లిన అనూహ్య 5వ తేదీన ముంబైలో రైలు దిగి అదృశ్యమై, ఆ తరువాత దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నాసిక్‌కు చెందిన చంద్రభాన్ సాసప్ను పోలీసులు అరెస్ట్ చేసి ముంబైలోని ఖిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 15 వరకు నిందితుడికి పోలీస్ కస్టడి విధించింది. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా కథనం ప్రకారం చంద్రభాన్ ఓ రైల్వే కూలీ కుమారుడు. తండ్రి మరణం తరువాత అతని లైసెన్సును తన పేరుపై మార్చుకొని కొంత కాలం రైల్వే కూలీగా పని చేశాడు. ఆ తరువాత అతను కొంతకాలం కాల్ సెంటర్లకు క్యాబ్ డ్రైవర్‌గా పని చేశాడు. ప్రస్తుతం అతను తన మూడవ భార్యతో నాసిక్‌లో నివాసం ఉంటున్నాడు. అక్కడే ట్రాన్స్పోర్ట్స్ డ్రైవర్‌గా చేస్తున్నాడు. చంద్రభాన్కు రైల్వేస్టేషన్లో బ్యాగులు, సెల్ ఫోన్లు దొంగిలించే అలవాటు ఉంది. అమ్మాయిలను వేధించే అలవాటు కూడా అతనికి ఉంది. అతనిపై ముంబై, మన్మాడ్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. 5వ తేదీ ఉదయం తన మిత్రులతో కలసి ముంబై రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అనూహ్య అతని కంటపడింది. 300 రూపాయలు ఇస్తే ఆమెను ఇంటి వద్ద దింపుతానని చెప్పాడు. ఆమె బయటకు వచ్చేసరికి అతను మోటార్ బైకు తెచ్చాడు. దాంతో ఆమె వెనకాడింది. అయితే ఆమెకు అతను నచ్చజెప్పాడు. తన బైకు నంబర్, సెల్ నంబర్ నోట్ చేసుకోమని చెప్పాడు. అనూహ్య అమాయకంగా నమ్మి బైకు ఎక్కి వెళ్లింది. ఆమెను తిలక్ నగర్ వైపు తీసుకువెళ్లాడు. ఆ తరువాత బైకులో పెట్రోల్ అయిపోయిందని బైకును నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఆపి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అనూహ్య ప్రతిఘటించింది. దాంతో ఆమెను చావబాది హత్య చేశాడు. -
అనూహ్య హత్యకేసు నిందితుడు అరెస్ట్
-
కోర్టుకు అనూహ్య హత్యకేసు నిందితుడు
ముంబయి : సాప్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్యకేసు నిందితుడు చంద్రభాను సాసప్ను పోలీసులు సోమవారం ముంబైలోని ఖిల్లా కోర్టులో హాజరు పరిచారు. చంద్రభాను సాసప్ను 15 రోజుల వరకూ పోలీస్ కస్టడికి కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుడిని పోలీసులు నాసిక్‌లో అరెస్ట్ చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన ఎస్తేర్ అనూహ్యను రెండు నెలల క్రితం (జనవరి 5) దుండగులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. అనూహ్య జనవరి 4న విజయవాడనుంచి ముంబయి బయల్దేరిన ఆమె అదేనెల16న ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
వీడిన అనూహ్య హత్య కేసు మిస్టరీ?
-
వీడిన అనూహ్య హత్య కేసు మిస్టరీ?
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సింగవరపు ఎస్తేర్ అనూహ్య(23) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు చేధించినట్లు సమచారం. సోమవారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనూహ్యను హత్య చేసింది నాసిక్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం (జనవరి 5)న అనూహ్యను దుండగులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య జనవరి 4న విజయవాడనుంచి ముంబయి బయల్దేరిన ఆమె అదేనెల16న ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అనూహ్య’ కేసులో మలుపులు... *జనవరి 4న విజయవాడ నుంచి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబైకి పయనం * 5న ముంబైలో రైలు దిగిన అనూహ్య అదృశ్యం *అదేరోజు ఆమె తండ్రి ప్రసాద్ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు * వారి సూచన మేరకు బంధువుల సాయంతో ముంబై రైల్వే పోలీసులకు అదేరోజు ఫిర్యాదు * మీరే వెతుక్కోండి.. అంటూ ముంబై పోలీసులు నిర్లక్ష్యంగా చెప్పడంతో అనూహ్య తండ్రి ప్రసాద్, బంధువుల సాయంతో ఆమె ఆచూకీ కోసం గాలింపు *9న అనూహ్య సెల్ సిగ్నల్ కంజుమార్గ్ ప్రాంతంలో గుర్తింపు * 16న అదే ప్రాంతంలో అనూహ్య మృతదేహం లభ్యం * అదేరోజు కేసు నమోదు చేసిన ముంబైలోని కంజూర్ ప్రాంత పోలీసులు *17న అనూహ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, ఆమె తండ్రి ప్రసాద్ నుంచి డీఎన్ఏ నమూనా సేకరించిన ముంబై వైద్యులు * 24న న్యాయం కోసం హోం మంత్రి షిండేను కలిసిన అనూహ్య తండ్రి ప్రసాద్ * ఫిబ్రవరి 1న ముంబై రైల్వేస్టేషన్‌లోని సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు అనూహ్యను ఒక ఆగంతకుడు వెంబడిస్తున్నట్టు ఉన్న అనుమానిత దృశ్యాల సేకరణ కోర్టులో నిందితుడు.. 15 రోజుల కస్టడీ! సాప్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్యకేసు నిందితుడు చంద్రభాను సాసప్ను పోలీసులు సోమవారం ముంబైలోని ఖిల్లా కోర్టులో హాజరు పరిచారు. చంద్రభాను సాసప్ను 15 రోజుల వరకూ పోలీస్ కస్టడికి కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుడిని పోలీసులు నాసిక్‌లో అరెస్ట్ చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన ఎస్తేర్ అనూహ్యను రెండు నెలల క్రితం (జనవరి 5) దుండగులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. అనూహ్య జనవరి 4న విజయవాడనుంచి ముంబయి బయల్దేరిన ఆమె అదేనెల16న ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
అనూహ్య హత్య కేసులో........
అనూహ్య హత్య కేసులో........ ుడివాడ టౌన్, అనూహ్య హత్య కేసులో పోలీసుల అశ్రద్ధ తగదని గుడివాడ డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంధం సత్యవర్ధనరావు ఖండించారు. ఎన్జీఓస్ హోంలో శనివారం నిర్వహించిన పాస్టర్లు, దళిత సంఘాల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనూహ్య హత్యానంతరం పొలీసులు స్పందన చూస్తుంటే.. దళితులపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోందని విమర్శించారు. రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోం మంత్రి దళితులైనప్పటికీ విషయం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. హత్య జరిగి నెలలు గడుస్తున్నా కేసు నత్తనడక నడుస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. పోలీసుల అలసత్వాన్ని ఖండిస్తూ ఈనెల 17వ తేదీన అన్ని క్రైస్తవ సంఘాలు, దళితసంఘాలు పట్టణంలో భారీర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. క్రైస్తవ, దళితసంఘాల నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో యునెటైడ్ పాస్టర్స్ ఫెలోషిప్ పట్టణాధ్యక్షుడు పి. ప్రేమ్‌సాగర్, పాస్టర్లు బీ ప్రభాకరరెడ్డి, సీజే దాస్, శ్యాంబాబు, శామ్యూల్, సురేష్, విలియంజోషి, పులవర్తి దీక్షితులు, విజయరావు, ఆదిమాంధ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు పొంగులేటి జయరాజు, దళితసంఘాల నాయకులు రాంబాబు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘అనూహ్య’ కేసులో వీడని మిస్టరీ
నెల రోజులైనా సా..గుతున్న దర్యాప్తు 14 పోలీస్ బృందాల గాలింపు నేటికీ నిందితులను గుర్తించని వైనం పాలకుల తీరుపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోతోంది.. కుమిలి కుమిలి గుండె అవిసిపోతోంది.. కంటికి నిద్ర రావటం లేదు.. గొంతులో ముద్ద దిగటం లేదు.. కన్న కూతుర్ని కర్కశంగా హత్య చేసిన కిరాతకుల కోసం నిరీక్షణ నిరాశగా మారుతోంది.. సత్తువ సన్నగిల్లుతున్నా మరుగుతున్న నెత్తురు మాత్రం కేంద్ర, మహారాష్ట్ర పాలకుల తీరుపై మండిపడితోంది.. ఇది బందరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎస్తేర్ అనూహ్యను కన్నవారి కడుపుకోత. సాక్షి, మచిలీపట్నం : శింగవరపు ఎస్తేర్ అనూహ్య (23) కన్నవారికి, ఉన్న ఊరికి దూరమై బుధవారంతో నెల రోజులు గడిచింది. ఆమె హత్యోదంతం వెలుగు చూసి 16 రోజులు దాటింది. అయినా ఘనత వహించిన మహారాష్ట్ర పోలీసులు ఇంతవరకు నిందితులను పట్టుకోలేకపోయారు. రోజుకో కథనం ప్రచారం జరుగుతున్నా వాటిని కొట్టిపారేస్తున్న ముంబై పోలీసులు ఈ కేసులో మిస్టరీని ఛేదించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ప్రభుత్వాల స్పందన నామమాత్రం... క్రిస్మస్ వేడుకల కోసం బందరు వచ్చిన అనూహ్య గత నెల 4న ముంబై లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆమె ఆచూకీ కనిపించకపోవడం, తండ్రి ప్రసాద్, బంధువులు ముంబై పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో గత నెల 16న కంజుమార్గ్ ప్రాంతంలో అనూహ్య విగతజీవిగా కనిపించింది. ఆమెను అత్యంత దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని అక్కడ పడేసినట్టు గుర్తించారు. ఆ తర్వాత కూడా ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల స్పందన నామమాత్రమే. పట్టించుకోని సీఎం, కేంద్ర హోం మంత్రి... ఈ కేసులో మిస్టరీని ఛేదించి నిందితులను పట్టుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర హోం మంత్రి షిండేలను అనూహ్య తండ్రి ప్రసాద్ కలిసినా ఫలితం లేకపోయింది. హోం మంత్రి షిండే సరిగా స్పందించలేదని ఆయన అప్పట్లో ఆవేదన వెలిబుచ్చారు. కొద్దిరోజుల క్రితం బిషప్ గోవాడ దైవాశీర్వాదం నేతృత్వంలోని క్రైస్తవ ప్రతినిధి బృందం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసింది. మహారాష్ట్ర సీఎంతో మాట్లాడతానని చెప్పిన సీఎం అటు తరువాత ఆ విషయాన్నే పట్టించుకోలేదు. దర్యాప్తులో 14 పోలీస్ బృందాలు.. నిందితులను పట్టుకోలేదు.. అనూహ్య కేసులో పోలీసుల దర్యాప్తు కొండను తవ్వుతున్నట్టు ఉంది. ఈ కేసులో మిస్టరీని ఛేదించేందుకు 14 ప్రత్యేక బృందాలను నియమించినట్టు పోలీసులు ప్రకటించారు. వారిలో ఒక సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో ఒక బృందం గత మూడు రోజులుగా బందరులో దర్యాప్తు చేస్తోంది. రెండు బృందాలు హైదరాబాద్‌లో దర్యాప్తు చేస్తున్నాయి. క్యాబ్ డ్రైవర్లను, అనూహ్య స్నేహితులను, అనుమానితులను పోలీసులు విచారించారు. అనూహ్య స్నేహితుడు హేమంత్‌ను కూడా విచారణ చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అతను తేల్చిచెప్పాడు. మరోవైపు ముంబైలో క్యాబ్ డ్రైవర్లు, ఆఫీసులో పనిచేసేవారు.. తమకు విరోధం ఉన్నవారిని ఈ కేసులో ఇరికించేలా పోలీసులను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు కూడా చేసినట్టు సమాచారం. కేసులో ఎటువంటి ఆధారాలూ దొరక్కపోవడంతో ముంబై రైల్వేస్టేషన్‌లోని సీసీ టీవీ పుటేజ్ నుంచి సేకరించిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పుటేజ్‌లో అనూహ్యను అనుసరించిన ఆగంతకుడు బందరు, హైదరాబాద్‌లకు చెందినవాడా అనే కోణంలో అతని ఫొటోలను పలు ప్రాంతాలకు పంపించి ప్రత్యేక బృందాలతో ఆరా తీస్తున్నారు. ఆగంతకుడి ఫొటోను ఆధార్ కార్డు ద్వారా పోల్చి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి సమీపంలోను, ఆఫీసులోను ఎవరితోనైనా అనూహ్యకు విరోధాలు ఉన్నాయా అనే కోణంలోనూ దృష్టి పెట్టారు. అనూహ్యకు సంబంధించిన స్నేహితులు, బంధువులు, ఆఫీసులోని వారు, ఇంటి చుట్టుపక్కల వారి వివరాలు, ఫోన్ నంబర్లను ముంబై పోలీసులు సేకరించారు. దీంతో అనూహ్య సెల్ కాల్ లిస్ట్‌లో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్‌కు సంబంధించిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. మరోవైపు అనూహ్య పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్టు ఈ కేసులో కీలకం కానున్నాయి. ‘అనూహ్య’ కేసులో మలుపులు... జనవరి 4న విజయవాడ నుంచి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబైకి పయనం 5న ముంబైలో రైలు దిగిన అనూహ్య అదృశ్యం అదేరోజు ఆమె తండ్రి ప్రసాద్ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు వారి సూచన మేరకు బంధువుల సాయంతో ముంబై రైల్వే పోలీసులకు అదేరోజు ఫిర్యాదు మీరే వెతుక్కోండి.. అంటూ ముంబై పోలీసులు నిర్లక్ష్యంగా చెప్పడంతో అనూహ్య తండ్రి ప్రసాద్, బంధువుల సాయంతో ఆమె ఆచూకీ కోసం గాలింపు 9న అనూహ్య సెల్ సిగ్నల్ కంజుమార్గ్ ప్రాంతంలో గుర్తింపు 16న అదే ప్రాంతంలో అనూహ్య మృతదేహం లభ్యం అదేరోజు కేసు నమోదు చేసిన ముంబైలోని కంజూర్ ప్రాంత పోలీసులు 17న అనూహ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, ఆమె తండ్రి ప్రసాద్ నుంచి డీఎన్ఏ నమూనా సేకరించిన ముంబై వైద్యులు 18న బందరులో అనూహ్య అంత్యక్రియలు, హత్యకు నిరసనగా బంద్ నిర్వహించారు. 21న ఈ కేసులో న్యాయం కోసం ఉద్యమించేందుకు బందరులో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు 24న న్యాయం కోసం హోం మంత్రి షిండేను కలిసిన అనూహ్య తండ్రి ప్రసాద్ 27న అనూహ్య కేసులో న్యాయం కోసం జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మమతా మోహన్‌దాస్‌కు వైఎస్సార్సీపీ నాయకుల విజ్ఞప్తి 31న సీఎం కిరణ్‌ను కలిసిన బిషప్ గోవాడ దైవాశీర్వాదం నేతృత్వంలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఫిబ్రవరి 1న ముంబై రైల్వేస్టేషన్‌లోని సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు అనూహ్యను ఒక ఆగంతకుడు వెంబడిస్తున్నట్టు ఉన్న అనుమానిత దృశ్యాల సేకరణ 3న ముంబైలోని కంజూర్ పోలీస్‌స్టేషన్ నుంచి ఒక సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు బందరు వచ్చి దర్యాప్తు చేపట్టారు. 4న కూడా దర్యాప్తు కొనసాగింది. 5న అఖిలపక్షం ఆధ్వర్యంలో బందరులో మరోమారు బంద్ -
అనూహ్య ఫ్రెండ్ మాత్రమే.. హత్యతో సంబంధం లేదు
హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య, తాను స్నేహితులం మాత్రమేనని.. ఆమె హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమంత్ స్పష్టం చేశాడు. అనూహ్యతో కలసి తాను ఒకే రైల్లో ముంబైకి వెళ్లినట్టు వచ్చినా వార్తలు అవాస్తమమని తెలిపాడు. మచిలీపట్నం అమ్మాయి అనూహ్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ 'సాక్షి'తో మాట్లాడాడు. ఆమెతో పరిచయం నుంచి హత్యకు ముందు వరకు జరిగిన పలు విషయాల్ని వెల్లడించాడు. గత నెల 5న ముంబైలో అనూహ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అనూహ్య హత్యకు ఓ రోజు ముందు అనగా జనవరి 4 మధ్యాహ్నం 1.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆమెను చివరిసారి కలిసినట్టు హేమంత్ చెప్పాడు. అనూహ్యతో కలిసే ఒకే రైల్లో వేరే కంపార్ట్మెంట్లో ముంబై వెళ్లినట్టు పోలీసులు చెప్పిన విషయం అవాస్తవమని చెప్పాడు. అదే రోజు సాయంత్రం వేరే రైల్లో షిర్డీకి ప్రయాణం చేసినట్టు చెప్పాడు. షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లినట్టు ఆధారాలు చూపించాడు. మరుసటి రోజు దర్శనం చేసుకుని అదే రోజు సాయంత్రం తిరిగి వచ్చానని హేమంత్ చెప్పాడు. కాగా సికింద్రాబాద్‌లో అనూహ్యను కలిసిన మాట వాస్తవమేనని, ఆ తర్వాత వెనక్కి వచ్చేశానని తెలిపాడు. కావాలంటే ఫుటేజిలో చూసుకోవచ్చని హేమంత్ చెప్పాడు. అనూహ్య బంధువుల సూచన మేరకు ముంబై వెళ్లి పోలీసులను కలిశానని తెలిపాడు. పోలీసులు రెండు రోజుల పాటు ఆరు గంటలు తనను ప్రశ్నించారని, తనకు తెలిసిన పూర్తి వివరాలు చెప్పానని వివరించాడు. తాను చెప్పిన సమాధానాలకు పోలీసులు సంతృప్తి చెందారని హేమంత్ తెలిపాడు. అనూహ్య రైల్లో వెళ్లిన కాసేపటికి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నామని, ఆ తర్వాత తమ మధ్య మాటలు లేవని చెప్పాడు. అనూహ్య ఇంటి నుంచి వస్తుండటంతో డిప్రెషన్లో ఉందని, అంతకుమించి ఇతర సమస్యలు, ఆందోళనలో ఉన్నట్టు కనిపించలేదని తెలిపాడు. ఆరో తేది మధ్యాహ్నం అనూహ్య హత్య గురించి తెలిసిందని హేమంత్ చెప్పాడు. కాకినాడలో అనూహ్యతో కలిసి బిటెక్ చదవడం వల్ల ఆమెతో పరిచయం ఏర్పడిందని హేమంత్ వివరించాడు. ఏడాదిన్నరగా అనూహ్య ముంబైలో ఉద్యోగం చేస్తోందని తెలిపాడు. ముంబైలో ఆమెకు చాలామంది స్నేహితులున్నారని, అయితే వారి వివరాలు తనకు తెలియవని చెప్పాడు. తామిద్దరం ఫోన్లో తమ సంగతులు తప్ప ఇతర విషయాలు మాట్లాడుకునే వారం కాదని తెలిపాడు. అనూహ్య అంత్యక్రియల్లో తాను పాల్గొన్నానని, ఆమె కుటుంబ సభ్యులతో హత్యకు సంబంధించి చర్చించానని తెలిపాడు. వారి దగ్గర ఎలాంటి సమాచారం లేదని, తనపై వారికి అనుమానం లేదని హేమంత్ చెప్పాడు. -
అనూహ్య మలుపులు
-
'అనూహ్యతో కలిసి ట్రైన్లో ప్రయాణించలేదు'
-
బందరులో ముంబై పోలీసుల విచారణ
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసుపై ముంబై పోలీసులు మచిలీపట్నంలో సోమవారం విచారణ నిర్వహించారు. ఈ కేసు విచారణ కోసం కంజూర్ పోలీస్‌స్టేషన్ సీఐ అశోక్, కోలీ, ఠాకూర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఇక్కడికి వచ్చారు. స్థానిక పోలీసులకు కూడా తెలియకుండా పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరిగి అనూహ్యతో పాటు రైల్వేస్టేషన్లో నడిచి వెళ్లిన వ్యక్తి ఫొటో చూపి ‘ఈ వ్యక్తి ఈ ప్రాంతానికి చెందిన వాడేనా’ అంటూ ఆరా తీశారు. అనంతరం అనూహ్య తండ్రి ప్రసాద్ ఇంటికి వెళ్లి పోలీసులు రైల్వేస్టేషన్ సీసీ టీవీ నుంచి తీసుకున్న ఫుటేజీలను చూపి.. ‘అనూహ్యతో నడిచి వెళుతున్న వ్యక్తి మీకు తెలుసా లేదా, అనూహ్యతో పాటు నడిచి వెళ్లేది హేమంతేనా?’ అని ప్రశ్నించారు. అనూహ్యతో పాటు రైల్వేస్టేషన్లో నడిచి వెళ్లే వ్యక్తి హేమంత్ కాదని అనూహ్య తండ్రి ప్రసాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హేమంత్ తమ కుటుంబ సభ్యుల్లో ఒకడని, అసలు దోషులను వదిలేసి హేమంత్‌ను అనుమానించటం సరికాదని వారికి సూచించారు. అనూహ్య హత్య కేసులో పలువురిని అనుమానిస్తున్నామని, వారందరినీ విచారణ చేస్తామని, అందులో హేమంత్ కూడా ఒకరని చెప్పి వెళ్లిపోయారు. ఐదు బృందాల గాలింపు... అనూహ్య హత్య కేసులో నిందితుల ఆచూకీ కోసం ఐదు పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు కంజూర్ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ విలేకరులకు తెలిపారు. అనూహ్య హత్య ఘటనపై కుంజూర్ పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదైందన్నారు. మచిలీపట్నంలో ఒక బృందం, హైదరాబాదులో రెండు బృందాలు అనూహ్య హత్య కేసులో నిందితులను కనుగొనేందుకు పర్యటిస్తున్నాయని ఆయన చెప్పారు. కుంజుమార్గ్ రైల్వేస్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అనూహ్యకు సమపంలో నడిచి వెళ్లే వ్యక్తి ఈ ప్రాంతానికి చెందిన వాడా, ఎవరికైనా ఇక్కడి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయా అనే అంశంపై విచారణ చేసేందుకు వచ్చామన్నారు. 300 మందిని విచారించాం... అనూహ్య హత్యకేసులో ఇప్పటికి 300 మందిని విచారించామని సీఐ చెప్పారు. అనూహ్య స్నేహితుడు హేమంత్‌తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని ఆయన వివరించారు. మరో రెండు రోజుల పాటు ఈ ప్రాంతంలో ఉండి వివరాలు సేకరిస్తామన్నారు. బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ మురళీధర్, మచిలీపట్నం ఎస్సై శ్రీహరిలతో ముంబై నుంచి వచ్చిన పోలీసు బృందం సంప్రదింపులు జరుపుతోంది. -
అనూహ్య హత్యకు సుపారీ ఇచ్చారా?
సాక్షి, ముంబై: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్యను తెలిసినవారే హత్య చేశారా? అందుకు సుపారీ (డబ్బులు) కూడా ఇచ్చారా? ముంబై పోలీసులు ఈ దిశగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనూహ్య మృతదేహం లభించి 18 రోజులు అవుతున్నప్పటికీ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో పెద్దగా పురోగతి సాధించలేదు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోయినా అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జనవరి 4న అనూహ్యకు భోజనం అందించిన ఆమె స్నేహితుడు హేమంత్ పాత్రతోపాటు ఆమెకు తెలిసినవారి గురించి ఆరా తీస్తున్నారు. అనూహ్యను తెలిసినవారే నేరుగా హత్య చేయనప్పటికీ ఎవరికైనా డబ్బులిచ్చి చేయించారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్టేషన్లో దిగిన తర్వాత ఎవరైనా దుండగులు అపహరించి తీసుకువెళ్లారా.. అనూహ్య ప్రతిఘటించడంతో చంపేసి, రోడ్డు పక్కన పొదల్లో వదిలేసి పారిపోయారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అనూహ్య కుర్లా రైల్వేస్టేషన్ లో దిగిన తర్వాత ఫోన్లో మాట్లాడుతూ బయటికి వెళ్లింది. ఆ సమయంలో ఎవరితో మాట్లాడిందో తెలి స్తే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసు లు చెబుతున్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే కీలక ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. -
అనూహ్యతో ఆరోజు ఉన్నదెవరు?
-
మలుపు తిరుగుతున్న అనూహ్య కేసు!
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన మచిలీపట్నంకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య (23) హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ముంబయి లోక్మాన్య తిలక్ టెర్మినల్ సీసీ ఫుటేజీ దర్యాప్తులో కీలకంగా మారింది. అనూహ్యతో ఓ వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రైలు దిగిన తర్వాత ఆమె ఓ వ్యక్తితో కలిసి వెయిటింగ్ రూమ్‌లోకి వెళ్లినట్టు గుర్తించారు. అతను అనుహ్యకు తెలిసిన వ్యక్తే అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఇంత వరకూ అతన్ని అదుపులోకి తీసుకోలేదని అంటున్నారు. అతన్ని పట్టుకుంటే హత్యకు సంబంధించిన కీలక సమాచారం లభిస్తుందని ముంబయి పోలీసులు భావిస్తున్నారు. మరో వైపు దర్యాప్తులో భాగంగా రైల్వే పోలీసులు, ముంబయు క్రైమ్ బ్రాంచ్ ప్రతినిధులు హైదరాబాద్ బయల్దేరినట్టు తెలుస్తోంది. అయితే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సింగవరపు ఎస్తేర్ అనూహ్య ఈనెల 5న అదృశ్యమైన 11 రోజుల తర్వాత కంజూర్‌మార్గ్‌కు సమీపంలో శవమై లభించిన విషయం విదితమే. హత్యకు ముందు ఆమెను ఐదు రోజుల పాటు లైంగిక దాడికి గురిచేశారని, చిత్రహింసలు పెట్టారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. కాగా ఈ కేసులో ఐదుగురు నిందితులను కుంజూర్‌మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు క్యాబ్ డ్రైవర్లు, ఇద్దరు వ్యభిచారగృహ నిర్వాకులు ఉన్నారు. అయితే విచారణ అనంతరం వారిని విడిచి పెట్టారు. అనూహ్య హత్య కేసులో పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. ఇది వస్తే అసలు హత్య ఎలా జరిగింది..? ఎప్పుడు జరిగింది..? దేనితో చేశారు..? మరోవైపు ఆ మృతదేహం అనూహ్యదేనా..? అనే తదితర ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. దీంతో పోలీసులు కూడా అనేక మంది అటో డ్రైవర్లతోపాటు రికార్డులో ఉన్న నేరస్తులను విచారించిన అనంతరం ఫోరెన్సిక్ నివేదిక కోసమే ఎదురుచూస్తున్నట్టుగా కన్పిస్తోంది. దీంతో ఈ నివేదికలో ఏమి ఉండనుందనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
భర్త వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు నందిగామ, న్యూస్‌లైన్ : కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య మృతి మరచిపోకముందే జిల్లాలోని నందిగామకు చెందిన మరో సాఫ్ట్వేర్ ఇంజినీరు షేక్ ఖాజాబీ (24) మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. కట్నం కోసం భర్త వేధింపులు తట్టుకోలేకే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి గుల్షాద్ పుణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల కథనం మేరకు.. ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చదివిన ఖాజాబీ క్యాంపస్ ఇంటర్వ్యూలో హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. దూరపు బంధువైన షేక్ మునీబ్‌ను ప్రేమించి పెద్దలకు తెలియకుండానే మూడు సంవత్సరాల కిందట హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. అతడికి పుణెలోని ఎల్అండ్టీ కంపెనీలో ఉద్యోగం రావడంతో తాను కూడా అక్కడికి బదిలీ చేయించుకుంది. ఈ నేపథ్యంలో మునీబ్ కట్నం కోసం వేధించసాగాడు. వేధింపులు తట్టుకోలేని ఖాజాబీ తల్లిదండ్రులకు చెప్పటంతో రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో తప్పించుకుని విజయవాడ రావడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి గుల్షాద్ ఫిర్యాదు మేరకు పుణె పోలీసులు.. ఖాజాబీ భర్త, అత్త, ఇద్దరు మరుదులు, ఆడపడుచుపై కేసు నమోదు చేశారు. మృతురాలి తండ్రి షేక్ లాల్‌సాహెబ్ విజయవాడలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మృతదేహం ఆదివారం సాయంత్రానికి నందిగామ వచ్చే అవకాశాలున్నట్లు బంధువులు తెలిపారు. -
అనూహ్య కేసును సీబీఐకి అప్పగించాలి
మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని డిమాండ్ విద్యార్థుల మానవహారం మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : ముంబైలో దారుణహత్యకు గురైన ఇంజినీరింగ్ విద్యార్థి సింగవరపు అనూహ్య కేసును ప్రభుత్వం వెంటనే సీబీఐకి అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని) డిమాండ్ చేశారు. కేసు విచారణను వేగవంతం చేసి.. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు శుక్రవారం నవకళా సెంటర్లో భారీ మానవహారం నిర్మించారు. అనూహ్య మృతికి కారకులైనవారికి కఠినంగా శిక్షించాలి.. ముంబై పోలీసులు డౌన్‌డౌన్.. అంటూ విద్యార్థులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. పేర్ని నాని మాట్లాడుతూ అనూహ్య కేసులో ముంబై పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కేంద్రం నిర్భయచట్టాన్ని అమల్లోకి తెచ్చినా ఇలాంటి ఘటనలు ఆగకపోవడం విచారకరమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము మాట్లాడుతూ కేసు విచారణను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఏపీ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.సుందరరామ్ మాట్లాడుతూ.. ఈ దారుణ సంఘటన సభ్యసమాజానికే సిగ్గుచేటని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు భారీ మానవహారం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ, సీపీఐ జిల్లా నాయకురాలు దేవభక్తుని నిర్మల, సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకుడు యద్దనపూడి సోని, వైఎస్సార్ సీపీ నాయకులు గాడెల్లి డేవిడ్ శామ్యూల్, పరింకాయల శ్రీనివాసరావు, ప్రైవేటు విద్యాసంస్థల అధినేతలు చిత్తజల్లు రామకృష్ణ, ఐ.వి.వి.కుమార్‌బాబు, కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అనూహ్య కేసులో.. ఎవరినీ అరెస్టు చేయలేదు!
అనూహ్య కేసులో ముంబై పోలీసుల వెల్లడి చానళ్లలో వచ్చిన వార్తలకు ఖండన ముంబైలో ప్రవాసాంధ్రుల నిరసన ర్యాలీ హ ంతకులను వెంటనే పట్టుకోవాలని హోంమంత్రికి వినతి సాక్షి, ముంబై/మచిలీపట్నం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్యను హత్య చేసిన దుండగులను పట్టుకున్నట్లు వచ్చిన వార్తలను ముంబై పోలీసులు ఖండించారు. ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టుచేయలేదని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. హంతకులను పట్టుకున్నట్లు మంగళవారం పలు టీవీ చానెళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి. ‘సాక్షి’ వీటిని కంజూర్‌మార్గ్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ నిశికాంత్ తుంగారే, కుర్లా రైల్వే పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ శిందే దృష్టికి తీసుకువెళ్లగా వారు అవన్నీ అవాస్తవమన్నారు. కాగా, అనూహ్యను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదానంలో స్థానిక తెలుగు ప్రజలు ర్యాలీ నిర్వహించారు. తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అనూహ్య మేనమామ అరుణ్‌కుమార్‌తోపాటు వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనూహ్యను హత్య చేసిన వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయని, తొందర్లోనే నిందితులను పోలీసులు పట్టుకుంటారని హోంమంత్రి వారికి హామీనిచ్చారు. కట్టుకథలు అల్లకండి: తన కూతురును హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారంటూ టీవీ ఛానెళ్లలో వచ్చిన వార్తలను అనూహ్య తండ్రి ప్రసాద్ ఖండించారు. అనూహ్య మృతదేహం లభ్యమైన స్థలానికి సమీపంలో ఒక బెడ్‌షీట్ దొరికినట్టు ముంబై పోలీసులు తనకు మెయిల్ చేశారని, అది తమ కుమార్తెది కాదని తిరిగి తాను మెయిల్లో సమాధానం ఇచ్చినట్టు చెప్పారు. తన కుమార్తె మృతిపై పోస్టుమార్టం నివేదిక వచ్చాకే నిజానిజాలు వెళ్లడవుతాయని, అంతవరకూ కట్టుకథలు అల్లకూడదని విజ్ఞప్తి చేశారు. మరోవైపు అనూహ్య హత్యను నిరసిస్తూ విజయవాడలో మేరీస్ స్టెల్లా కాలేజీ విద్యార్థినులు మంగళవారం భారీ ర్యాలీ, మావహారం నిర్వహించి నిరసన తెలిపారు. అనూహ్య తండ్రికి మైసూరారెడ్డి ఫోన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు పార్టీ పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి మంగళవారం అనూహ్య తండ్రి ప్రసాద్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఉదంతాన్ని తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావిస్తారని చెప్పారు. కాగా, అనూహ్యకు జరిగిన దారుణాన్ని వివరించేందుకు ఆమె తండ్రిని ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర హోంమంత్రి షిండేల వద్ద తీసుకుని వెళ్తామని వైఎస్సార్సీపీ బందరు పార్లమెంట్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కేవీఆర్ విద్యాసాగర్ తెలిపారు. ప్రధాని, హోంమంత్రి అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. -
'అనూహ్య' కేసులో నమ్మలేని నిజాలు
-
అండగా ఉంటాం: అనూహ్య తండ్రికి జగన్ భరోసా
-
అండగా ఉంటాం: అనూహ్య తండ్రికి జగన్ భరోసా
మచిలీపట్నం, న్యూస్‌లైన్: ‘ఎంతో భవిష్యత్తు ఉన్న అనూహ్య హత్యకు గురి కావటం చాలా బాధగా ఉంది.. ఈ కష్టంలో మేం మీకు అండగా ఉంటాం..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం అనూహ్య తండ్రి శింగవరపు ప్రసాద్‌కు భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రలో ఉన్న ఆయన ప్రసాద్‌ను ఫోన్లో పరామర్శించారు. అనూహ్య కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి, దోషులకు శిక్ష పడేలా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. అవసరమైతే వైఎస్సార్సీపీ తరఫున ఎంపీల బృందాన్ని మహారాష్ట్రకు పంపుతామన్నారు. దోషులకు శిక్ష పడేవరకు పోరాడతామని హామీ ఇచ్చారు. పార్లమెంటులో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని జగన్ చెప్పారు. క్రైస్తవ మత బోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ కూడా సోమవారం అనూహ్య తండ్రిని ఫోన్లో పరామర్శించారు. -
పురోగతి లేని ‘అనూహ్య’ కేసు
సాక్షి, ముంబై: అనూహ్య అదృశ్యమైంది ఈనెల 5న.. శవమై తేలింది 11 రోజుల తర్వాత.. ఇప్పుడు మరో ఐదు రోజులు గడిచిపోయాయి. అయినా ఈ హత్య కేసులో పురోగతి ఏమాత్రం కనిపించడం లేదు. హత్యకు పాల్పడ్డవారిని పట్టుకోవడం కాదు కదా.. వారికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు సేకరించలేకపోయారు. ఓవైపు రైల్వే పోలీసులు.. మరోవైపు కంజూర్ మార్గ్ పోలీసులు.. ఇంకోవైపు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నా మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోతున్నారు. మృతదేహం లభిం చిన ఐదు రోజుల తర్వాత అనూహ్య పాదరక్షలు, దుప్పటిని గుర్తించారు. ఆమె మృతదేహం లభించిన చోటు నుంచి సుమా రు కిలోమీటరు దూరంలో ఈ వస్తువులు ఆదివారం లభించినట్లు పోలీసులు వెల్లడించారు. యువతి స్నేహితుడు హేమంత్పై ఇంకా ఆరా తీస్తున్నారు. ఆమె ముంబైలో దిగిన రోజు హేమంత్ సెల్‌ఫోన్ షిర్డీలో ట్రేస్ అయిందని, తర్వాత అతను హైదరాబాద్‌కు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. కాగా, అనూహ్య మృతదేహం బయటపడ్డ కం జూర్మార్గ్ ప్రాంతంలో సోమవారం ‘సాక్షి’ పర్యటించింది. అనూహ్య కేసు దర్యాప్తు చేస్తున్న కంజూర్ మార్గ్ పోలీసు ఇన్స్పెక్టర్ నిశికాంత్ తుంగారేతోపాటు స్థానికులను కేసు గురించి అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించింది. సాక్షి పరిశీలనలో వెల్లడైన విషయాలివీ.. - అనూహ్య భౌతికకాయం లభించిన ప్రాంతం కంజూర్ మార్గ్ పోలీస్ స్టేషన్ నుంచి సుమారు ఒకటి, ఒకటిన్నర కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉంది. - ఈ ప్రాంతాన్ని కంజూర్-భాండూప్గా చెప్పుకుంటారు. కొందరు స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇక్కడ నివసిస్తున్నారు. - ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే సర్వీస్ రోడ్డు పక్కన నిర్మానుష్యంగా ఉన్న చెట్లపొదల్లో అనూహ్య శవం దొరికింది. ఇక్కడ ఆకతాయిలు, నేరచరిత్ర కలిగినవారు మద్యం తాగుతుంటారు. అప్పుడప్పుడు అక్కడ గొడవలు జరిగేవి. - ఈ ప్రాంతం గురించి తెలిసినవారే అనూహ్యను ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేసి ఉండొచ్చని అనుమానం. -
కిలోమీటర్ దూరంలో అనూహ్య చెప్పులు
ముంబై: అనూహ్య కేసు విషయంలో ముంబై పోలీసులలో కదలిక వచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య ముంబైలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో మహారాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 4న విజయవాడలో లోక్మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన అనూహ్య 16న ముంబైలోని కంజూర్ మార్గ్-భాండూప్ మధ్యలో ఈస్టరన్ ఎక్స్‌ప్రెస్ హైవే సర్వీస్ రోడ్డు పక్కన శవంగా కనిపించింది. అనూహ్య కనిపించడంలేదని ఫిర్యాదు ఇచ్చిన తరువాత గానీ, మృతదేహం కనిపించిన తరువాత గానీ మహారాష్ట్ర పోలీసులు సరిగా స్పందించలేదని అనూహ్య బంధువులు ఆరోపించారు. దర్యాప్తు కూడా సరిగా జరగడంలేదని వారు చెప్పారు. ఈ కేసు విషయమై డీజీపీ బి. ప్రసాద రావు ముంబై పోలీసులతో మాట్లాడారు. దాంతో ముంబై పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేశారు. మృతదేహం లభించిన ప్రదేశం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో క్లూస్ ఏమైనా దొరుకుతాయోమోనని వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారికి ఘటనా స్థలానికి కిలోమీటర్ దూరంలో అనూహ్యకు చెందిన బ్లాంకెట్, చెప్పులు కనిపించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అనూహ్యకు కన్నీటి వీడ్కోలు
-
అనూహ్యకు కన్నీటి వీడ్కోలు: పోసాని స్పందన
-
అనూహ్యకు కన్నీటి వీడ్కోలు
బందరులో ముగిసిన అంత్యక్రియలు అంతిమ యాత్రలో పాల్గొన్న విద్యార్థులు, నేతలు, మతపెద్దలు కొనసాగుతున్న కేసు దర్యాప్తు సాక్షి, మచిలీపట్నం: ముంబైలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య (23) అంత్యక్రియలు శనివారం మచిలీపట్నంలో ముగిశాయి. సెయింట్ మేరీస్ (అరబెల్ల) చర్చిలో ప్రార్థనల అనంతరం అనూహ్య మృతదేహాన్ని క్రైస్తవ సంప్రదాయ ప్రకారం ఖననం చేశారు. వివిధ పార్టీల నేతలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మత పెద్దలు అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అనూహ్య హంతకులకు ఉరిశిక్ష విధించాలని, ఆమె ఆచూకీ కనుగొనడంలో నిర్లక్ష్యం వహించిన ముంబై పోలీసులను అరెస్టు చేయాలని నినదించారు. ముంబై పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తన బిడ్డ దక్కేదని అనూహ్య తండ్రి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. హ–{దోగంతో బాధపడుతున్న అనూహ్య తల్లి జ్యోత్స్నను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు అనూహ్య కుటుంబీకులకు ఫోన్ చేసి తమ సంతాపం తెలిపారు. అనూహ్య ఘటనకు నిరసనగా శనివారం బందరులో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. డీజీపీ ఆరా..: అనూహ్య కేసులో ముంబై పోలీసుల తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు.. శనివారం అక్కడి పోలీసుల నుంచి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అనూహ్యకు భోజనం ప్యాకెట్ ఇచ్చిన హేమంత్, సహోద్యోగి రాజశేఖర్లపై పోలీసులు దృష్టి సారించారు. ముంబై రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆమె ప్రయాణించిన మ్యాక్సి క్యాబ్ డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం. ముంబైకి రైల్వే సీఐని పంపించినట్టు విజయవాడ రైల్వే ఎస్పీ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. మరోవైపు అనూహ్య తల్లి నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించేందుకు ముంబై పోలీసులు రెండ్రోజుల్లో మచిలీపట్నం రానున్నారు. అన్నింటా ఫస్ట్..: ప్రసాద్, జ్యోత్స్న దంపతులకు అనూహ్య, లావణ్య ఇద్దరు కూతుళ్లు. అనూహ్య ఆటపాటలు, చదువుల్లో ఎప్పుడూ ముందుండేది. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించి, జీవితంలో స్థిరపడుతున్న సమయంలో హత్యకు గురి కావడం ఆ కుటుంబాన్ని కలచివేస్తోంది. అనూహ్య ఒకటి నుంచి 8వ తరగతి వరకు మచిలీపట్నంలోని షారన్ స్కూలులో చదివింది. 9, 10 తరగతులు శ్రీ అమరేశ్వరి విద్యానికేతన్‌లో చదివింది. ఇంటర్ మచిలీపట్నంలోని శ్రీచైతన్య కాలేజీలో చదివింది. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించి కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ ఆఖరి ఏడాది చదువుతుండగానే క్యాంపస్ సెలక్షన్స్‌లో టీసీఎస్‌లో ఉద్యోగానికి ఎంపికైంది. ఉద్యోగ నిమిత్తం ఆరునెలల పాటు కేరళలో టీసీఎస్ కంపెనీ శిక్షణ ఇచ్చారు. తన కూతురు కొత్త ప్రాంతంలో ఉద్యోగ శిక్షణకు ఇబ్బంది పడుతుందని భావించిన తండ్రి ప్రసాద్... తాను కూడా కేరళకు వెళ్లి తోడుగా ఉన్నారు. -
'హంతకులను బహిరంగంగా కాల్చేసేలా శిక్ష విధించాలి'
విజయవాడ: ముంబైలో అనూహ్యను హత్య చేసిన హంతకులను బహిరంగంగా కాల్చేసేవిధంగా శిక్ష విధించి, అమలు చేయాలని వైఎస్ఆర్ సీపీ నేత పేర్ని నాని అన్నారు. ముంబైలో దారుణంగా హత్యకు గురైన అనూహ్య భౌతికకాయానికి ఈ రోజు మచిలీపట్నంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ అనూహ్య మృతి దురదృష్టకరం అన్నారు. చట్టాలు వచ్చినా మహిళలపై దాడులను ప్రభుత్వాలు ఆపలేకపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులను బహిరంగా కాల్చేసే శిక్షలు అమలుచేయాలని డిమాండ్ చేశారు.