
అనూహ్య హత్య కేసులో........
అనూహ్య హత్య కేసులో........
ుడివాడ టౌన్,
అనూహ్య హత్య కేసులో పోలీసుల అశ్రద్ధ తగదని గుడివాడ డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంధం సత్యవర్ధనరావు ఖండించారు. ఎన్‌జీఓస్ హోంలో శనివారం నిర్వహించిన పాస్టర్లు, దళిత సంఘాల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనూహ్య హత్యానంతరం పొలీసులు స్పందన చూస్తుంటే.. దళితులపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోందని విమర్శించారు. రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోం మంత్రి దళితులైనప్పటికీ విషయం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. హత్య జరిగి నెలలు గడుస్తున్నా కేసు నత్తనడక నడుస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. పోలీసుల అలసత్వాన్ని ఖండిస్తూ ఈనెల 17వ తేదీన అన్ని క్రైస్తవ సంఘాలు, దళితసంఘాలు పట్టణంలో భారీర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. క్రైస్తవ, దళితసంఘాల నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో యునెటైడ్ పాస్టర్స్ ఫెలోషిప్ పట్టణాధ్యక్షుడు పి. ప్రేమ్‌సాగర్, పాస్టర్లు బీ ప్రభాకరరెడ్డి, సీజే దాస్, శ్యాంబాబు, శామ్యూల్, సురేష్, విలియంజోషి, పులవర్తి దీక్షితులు, విజయరావు, ఆదిమాంధ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు పొంగులేటి జయరాజు, దళితసంఘాల నాయకులు రాంబాబు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.