పరిమళించిన మానవత్వం... | Rs 4 lakhs money help for Anuhya medical expenses | Sakshi
Sakshi News home page

పరిమళించిన మానవత్వం...

Published Sun, Jan 18 2015 4:17 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

పరిమళించిన మానవత్వం... - Sakshi

పరిమళించిన మానవత్వం...

అనూహ్యకు వైద్య ఖర్చుల కోసం రూ.4 లక్షలు సాయం
ప్రకటించిన ‘మా-ఆసరా’ సంస్థ

బంజారాహిల్స్: ‘అయ్యో పాపం.. అనూహ్య’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు పలువురు స్పందించి అనూహ్య వైద్య ఖర్చుల కోసం ముందుకొచ్చారు. శనివారం అనూహ్యను కబలిస్తున్న వ్యాధిపై సాక్షి ప్రచురించిన కథనానికి స్పందించి చిన్నారి తల్లిదండ్రులకు పలువురు ఫోన్ చేసి భరోసానిచ్చారు. బంజారాహిల్స్‌కు చెందిన మా-ఆసరా స్వచ్ఛంద సంస్థ తరపున అనూహ్య వైద్య ఖర్చుల కోసం రూ. 4 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.

సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు దేశరాజు మాలతి మాట్లాడుతూ చిన్నారి వైద్య ఖర్చుల కోసం తమ సంస్థలో ఉన్న 500 మంది సభ్యులు స్పందించి ఈ మేరకు డబ్బులు పోగు చేసినట్లు తెలిపారు. ఈ సహాయం ఇంతటితో ఆగదని చిన్నారికి బాగయ్యేంత వరకు స్పందిస్తూనే ఉంటామని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement