వీడిన అనూహ్య హత్య కేసు మిస్టరీ? | Esther Anuhya murder case solved, say police | Sakshi
Sakshi News home page

వీడిన అనూహ్య హత్య కేసు మిస్టరీ?

Published Mon, Mar 3 2014 8:13 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

వీడిన అనూహ్య హత్య కేసు మిస్టరీ? - Sakshi

వీడిన అనూహ్య హత్య కేసు మిస్టరీ?

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సింగవరపు ఎస్తేర్ అనూహ్య(23) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు చేధించినట్లు సమచారం. సోమవారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనూహ్యను హత్య చేసింది నాసిక్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం (జనవరి 5)న అనూహ్యను దుండగులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య జనవరి 4న విజయవాడనుంచి ముంబయి బయల్దేరిన ఆమె  అదేనెల16న  ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


అనూహ్య’ కేసులో మలుపులు...
 *జనవరి 4న విజయవాడ నుంచి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబైకి పయనం
* 5న ముంబైలో రైలు దిగిన అనూహ్య అదృశ్యం
*అదేరోజు ఆమె తండ్రి ప్రసాద్ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు
* వారి సూచన మేరకు బంధువుల సాయంతో ముంబై రైల్వే పోలీసులకు అదేరోజు ఫిర్యాదు
* మీరే వెతుక్కోండి.. అంటూ ముంబై పోలీసులు నిర్లక్ష్యంగా చెప్పడంతో అనూహ్య తండ్రి ప్రసాద్, బంధువుల సాయంతో ఆమె ఆచూకీ కోసం గాలింపు
*9న అనూహ్య సెల్ సిగ్నల్ కంజుమార్గ్ ప్రాంతంలో గుర్తింపు
* 16న అదే ప్రాంతంలో అనూహ్య మృతదేహం లభ్యం
* అదేరోజు కేసు నమోదు చేసిన ముంబైలోని కంజూర్ ప్రాంత పోలీసులు
*17న అనూహ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, ఆమె తండ్రి ప్రసాద్ నుంచి డీఎన్‌ఏ నమూనా సేకరించిన ముంబై వైద్యులు
* 24న న్యాయం కోసం హోం మంత్రి షిండేను కలిసిన అనూహ్య తండ్రి ప్రసాద్
 * ఫిబ్రవరి 1న ముంబై రైల్వేస్టేషన్‌లోని సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు అనూహ్యను ఒక ఆగంతకుడు వెంబడిస్తున్నట్టు ఉన్న అనుమానిత దృశ్యాల సేకరణ

కోర్టులో నిందితుడు.. 15 రోజుల కస్టడీ!

సాప్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్యకేసు నిందితుడు చంద్రభాను సాసప్ను పోలీసులు సోమవారం ముంబైలోని ఖిల్లా కోర్టులో హాజరు పరిచారు. చంద్రభాను సాసప్ను 15 రోజుల వరకూ పోలీస్ కస్టడికి కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుడిని పోలీసులు నాసిక్లో అరెస్ట్ చేశారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన ఎస్తేర్ అనూహ్యను రెండు నెలల క్రితం (జనవరి 5) దుండగులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. అనూహ్య జనవరి 4న విజయవాడనుంచి ముంబయి బయల్దేరిన ఆమె  అదేనెల16న  ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement