
కోర్టుకు అనూహ్య హత్యకేసు నిందితుడు
ముంబయి : సాప్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్యకేసు నిందితుడు చంద్రభాను సాసప్ను పోలీసులు సోమవారం ముంబైలోని ఖిల్లా కోర్టులో హాజరు పరిచారు. చంద్రభాను సాసప్ను 15 రోజుల వరకూ పోలీస్ కస్టడికి కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుడిని పోలీసులు నాసిక్లో అరెస్ట్ చేశారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన ఎస్తేర్ అనూహ్యను రెండు నెలల క్రితం (జనవరి 5) దుండగులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. అనూహ్య జనవరి 4న విజయవాడనుంచి ముంబయి బయల్దేరిన ఆమె అదేనెల16న ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.