ముంబయిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శింగవరపు ఎస్తేర్ అనూహ్య (23)కు మచిలీపట్నంలో శనివారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులతో పాటు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు.