cremate
-
ఐదు రోజులుగా భర్త అంత్యక్రియలను నిర్వహించని భార్య
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఆస్తి వివాదంతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని యువకు డు ఆత్మహ్యకు పాల్పడ్డాడు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందేనని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేపట్టడంతో ఐదు రోజుల తర్వాత అంత్యక్రియలు జరిగాయి. ఈ ఘటన సదాశివపేట మండల పరిధిలోని తంగడపల్లి గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సిరిపురం మణయ్య, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నవీన్, రాములు, కుమార్తె రజిత ఉన్నారు. గతేడాది చిన్న కుమారుడు నవీన్ మృతి చెందాడు. అతడి భార్యకు భూమి ఇవాల్సి వస్తుందని మణయ్య, మణెమ్మ దంపతులు తమ మూడెకరాల భూమిని అల్లుడు హోంగార్డ్ మల్లేశం పేరుపై సెల్ డీడ్ చేశారు. ఈ విషయం తెలిసి భూమిలో సగం వాటా తనకు ఇవ్వాలని పెద్దకుమారుడు రాములు(32) అడిగాడు. వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై 18న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అదే రోజు రాత్రి సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్తిలో తమకు వాటా ఇవ్వాలని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మృతదేహం ఐదురోజులుగా ఆస్పత్రిలోనే ఉంది. మంగళవారం సమస్య సద్దుమణగడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహేష్ గౌడ్ తెలిపారు. -
కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది!
సాక్షి, పత్తికొండ రూరల్ (కర్నూలు): అనారోగ్యంతో చనిపోయిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన ఉదంతమిది. ఈ హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ మురళీమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పత్తికొండలోని తేరు బజారులో మెడికల్ షాపు నిర్వహిస్తున్న హరికృష్ణప్రసాద్ (63)కు భార్య లలితమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కన్నబిడ్డలకు ఎలాంటి లోటులేకుండా పెంచిపెద్ద చేసి ఉన్నత చదువులు చదివించారు. ఇద్దరికీ పెళ్లిళ్లు కూడా చేశారు. పెద్ద కుమారుడు దినేష్ ఎంబీబీఎస్ పూర్తి చేసి కర్నూలులోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ అక్కడే భార్యతో కాపురం ఉంటున్నారు. రెండో కుమారుడు ముఖేష్ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల కిందట హరికృష్ణ ప్రసాద్‌కు పార్కిన్సస్ ప్లస్ వ్యాధి సోకింది. మరికొన్ని రోజులకు పక్షవాతంతో కాళ్లు చేతులు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమయ్యాడు. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని దయనీయ స్థితిలో ఉన్న అతనికి భార్య లలితమ్మ సపర్యలు చేస్తూ వచ్చింది. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మూడేళ్ల నుంచి కర్నూలులో కుమారుడు దినేష్ వద్దే దంపతులిద్దరూ ఉన్నారు. రెండు వారాల క్రితం ఇద్దరూ పత్తికొండకు చేరుకున్నారు. కాగితాలు.. చీరలు వేసి నిప్పు కాగా, సోమవారం వేకువజామున భర్త హరికృష్ణప్రసాద్‌కు భార్య లలితమ్మ కాలకృత్యాలు తీర్చింది. ఆ తరువాత కొద్దిసేపటికి విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి గుండె పగిలేలా రోదించింది. ఆ తరువాత తేరుకుని టెంకాయ కొట్టి.. మృతదేహంపై ఇంట్లోని పుస్తకాలు చింపి కాగితాలు, చీరలు వేసి నిప్పు పెట్టింది. ఆ తరువాత పెద్దకుమారుడు దినేష్‌కు వీడియో కాల్ చేసి విషయం చెప్పింది. ఆ ఇంట్లోంచి పొగలు రావడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ మురళీమోహన్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకోగా.. అప్పటికే మృతదేహం పూర్తిగా కాలిపోయింది. లలితమ్మ మానసిక పరిస్థితి సరిగా లేదని సీఐ తెలిపారు. ఇంట్లోనే మృతదేహం కాల్చిన ఘటన దావానలంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల కాలనీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కంటికిరెప్పలా కాపాడుకుంటూ ఇన్నేళ్లు సపర్యలు చేసిన ఆమె భర్త మృతదేహాన్ని ఇంట్లోనే కాలి్చవేసిందంటే నమ్మలేకపోయారు. లలితమ్మ నిత్యం దైవారాధనలో ఎక్కువగా గడిపేదని కాలనీవాసులు తెలిపారు. నోట మాట రాలేదు అమ్మ ఉదయం 9.30 గంటలకు ఫోన్ చేసింది. ‘నాన్న చనిపోయాడు. ఇంట్లోనే దహన సంస్కారాలన్నీ పూర్తి చేశాను. మీరేం రాకండి’ అని చెప్పింది. ఆ మాట విని షాక్‌కు గురయ్యాను. వెంటనే పోలీసులకు సమాచారం అందజేసి పత్తికొండ చేరుకున్నాను. ఇంట్లోకి వెళ్లగా కాలిన నాన్న మృతదేహం చూసి నా నోట మాట రాలేదు. అమ్మ పూర్తిగా డిప్రెషన్‌కు గురైంది. అమ్మ దగ్గరకు వెళ్లి ఓదార్చాను. కెనడాలో ఉన్న తమ్ముడు ముఖేష్‌కు ఫోన్ చేశాను. వెంటనే బయల్దేరి వస్తున్నానని చెప్పాడు. – దినేష్, పెద్ద కుమారుడు చదవండి: Delhi: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..! -
అనూహ్యకు కన్నీటి వీడ్కోలు
-
అనూహ్యకు కన్నీటి వీడ్కోలు
బందరులో ముగిసిన అంత్యక్రియలు అంతిమ యాత్రలో పాల్గొన్న విద్యార్థులు, నేతలు, మతపెద్దలు కొనసాగుతున్న కేసు దర్యాప్తు సాక్షి, మచిలీపట్నం: ముంబైలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య (23) అంత్యక్రియలు శనివారం మచిలీపట్నంలో ముగిశాయి. సెయింట్ మేరీస్ (అరబెల్ల) చర్చిలో ప్రార్థనల అనంతరం అనూహ్య మృతదేహాన్ని క్రైస్తవ సంప్రదాయ ప్రకారం ఖననం చేశారు. వివిధ పార్టీల నేతలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మత పెద్దలు అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అనూహ్య హంతకులకు ఉరిశిక్ష విధించాలని, ఆమె ఆచూకీ కనుగొనడంలో నిర్లక్ష్యం వహించిన ముంబై పోలీసులను అరెస్టు చేయాలని నినదించారు. ముంబై పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తన బిడ్డ దక్కేదని అనూహ్య తండ్రి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. హ–{దోగంతో బాధపడుతున్న అనూహ్య తల్లి జ్యోత్స్నను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు అనూహ్య కుటుంబీకులకు ఫోన్ చేసి తమ సంతాపం తెలిపారు. అనూహ్య ఘటనకు నిరసనగా శనివారం బందరులో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. డీజీపీ ఆరా..: అనూహ్య కేసులో ముంబై పోలీసుల తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు.. శనివారం అక్కడి పోలీసుల నుంచి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అనూహ్యకు భోజనం ప్యాకెట్ ఇచ్చిన హేమంత్, సహోద్యోగి రాజశేఖర్లపై పోలీసులు దృష్టి సారించారు. ముంబై రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆమె ప్రయాణించిన మ్యాక్సి క్యాబ్ డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం. ముంబైకి రైల్వే సీఐని పంపించినట్టు విజయవాడ రైల్వే ఎస్పీ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. మరోవైపు అనూహ్య తల్లి నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించేందుకు ముంబై పోలీసులు రెండ్రోజుల్లో మచిలీపట్నం రానున్నారు. అన్నింటా ఫస్ట్..: ప్రసాద్, జ్యోత్స్న దంపతులకు అనూహ్య, లావణ్య ఇద్దరు కూతుళ్లు. అనూహ్య ఆటపాటలు, చదువుల్లో ఎప్పుడూ ముందుండేది. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించి, జీవితంలో స్థిరపడుతున్న సమయంలో హత్యకు గురి కావడం ఆ కుటుంబాన్ని కలచివేస్తోంది. అనూహ్య ఒకటి నుంచి 8వ తరగతి వరకు మచిలీపట్నంలోని షారన్ స్కూలులో చదివింది. 9, 10 తరగతులు శ్రీ అమరేశ్వరి విద్యానికేతన్‌లో చదివింది. ఇంటర్ మచిలీపట్నంలోని శ్రీచైతన్య కాలేజీలో చదివింది. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించి కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ ఆఖరి ఏడాది చదువుతుండగానే క్యాంపస్ సెలక్షన్స్‌లో టీసీఎస్‌లో ఉద్యోగానికి ఎంపికైంది. ఉద్యోగ నిమిత్తం ఆరునెలల పాటు కేరళలో టీసీఎస్ కంపెనీ శిక్షణ ఇచ్చారు. తన కూతురు కొత్త ప్రాంతంలో ఉద్యోగ శిక్షణకు ఇబ్బంది పడుతుందని భావించిన తండ్రి ప్రసాద్... తాను కూడా కేరళకు వెళ్లి తోడుగా ఉన్నారు.