మాంగల్య బలం | Mass Marriages in Karnataka | Sakshi
Sakshi News home page

మాంగల్య బలం

Published Fri, Jul 5 2019 7:23 AM | Last Updated on Fri, Jul 5 2019 7:23 AM

Mass Marriages in Karnataka - Sakshi

ఇటీవల సామూహిక పెళ్లి వేడుకలో ఒక్కటైన జంటలు

సాక్షి, బళ్లారి: మారుతున్న కాలానుగుణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు పెళ్లిళ్లు చేయడం కష్టతరం అవుతున్న తరుణంలో ఆస్తులు అమ్మి పెళ్లిళ్లు చేసేవారిని, అప్పు లు చేసి పెళ్లిళ్లు చేసే వారిని ఎందరినో చూస్తుంటాం. పరువు, ప్రతిష్టల కోసం పెళ్లిళ్లు చేయడాని కి లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఎంతో ఇ బ్బందులకు గురి అవుతుంటారు. ప్రతి ఒక్కరూ పెళ్లిళ్లను ఆడంబరంగా చేయడానికే ఇష్టపడుతు న్న నేటిరోజుల్లో ఈ గ్రామంలో మాత్రం అత్యం త నిరాడంబరంగా, అది కూడా సామూహికంగా వివాహాలను జరిపి ఆదర్శంగా నిలుస్తున్నారు.

వధువైనా వరుడైనా పెళ్లి ఇక్కడే  
 ఇటీవల ఐదు జంటలకు సామూహికంగా పెళ్లిళ్లు జరిగాయి. ఇక్కడ పురుషుడికి, స్త్రీలకు చట్ట ప్రకారం యుక్తవయస్సు వచ్చిన తర్వాత పెద్దలు అంగీకరించిన తర్వాతే పెళ్లికి అంగీకరిస్తారు. ఈ గ్రామంలో ఆడపిల్లను ఏ ఊరికి ఇచ్చినా వివాహంమాత్రం ఇక్కడే జరుపుతారు. వరుడు కూడా ఏ ఊరిలో పెళ్లి కుదిరినా ఈ గ్రామంలోనే పెళ్లి చేసుకుంటారు. కాలం ఎంతో మారుతున్న నేటి పరిస్థితుల్లో కూడా నేటి యువతీ యువకులు కూడా ఈ సంస్కృతి, సంప్రదాయాన్ని ఆచరిస్తుండటం అంతటా ప్రఖ్యాతి పొందింది.

ఇంటి వాకిట్లోనే మాంగల్య ధారణ  
ఈ వివాహాల లగ్నపత్రికను కూడా సామూహికంగానే అచ్చు వేయిస్తారు. ఈ జంటలకు సంబంధించిన ఇరువైపుల వారిని ఆహ్వానిస్తారు. మాంగల్యధారణ మాత్రం వధువు పుట్టినింటనే జరగడం విశేషం. అందరూ కలిసి భోజనాలు,  జాభజంత్రీల బృందాన్ని కలిపే ఎంపిక చేస్తారు. మొత్తం ఖర్చును లెక్కించి అందరూ సమానంగా భరిస్తారు. ఇంత తక్కువ ఖర్చులో వివాహం చేయడం సామూహిక వివాహ పద్ధతి వల్లే సాధ్యమైందని బెల్లదారహట్టి గ్రామ పంచాయతీ సభ్యుడు రుద్రముని సాక్షికి తెలిపారు. పెళ్లి ఖర్చులు తగ్గడంతో మిగిలిన డబ్బును కొత్త జంట ఇంటి అవసరాలకు ఉపయోగిస్తామని, అప్పుల బాధ కూడా దగ్గరకు రాదని సంతోషంగా చెప్పారు.  

దుబారా ఖర్చులకు చెక్‌ 
సామూహిక వివాహాలను కూడా నిరాడంబరంగా చేసుకుంటారు. కనీస సౌకర్యాలకు నోచుకోని మారుమూల గ్రామమైన ఈ ఊరులో ఈడిగ, కుమ్మర కులస్తులే ఎక్కువగా నివసిస్తున్నారు. 200 ఇళ్లు, 1500 జనాభా ఉండగా వీటిలో 150 ఇళ్లు ఈడిగ వర్గానికి చెందినవి. ఈ గ్రామంలో తమ తల్లిదండ్రుల వివాహం కూడా సామూహిక వి వాహ వేడుకల్లోనే జరిగిందని ఆ గ్రామ పం చాయితీ సభ్యుడు  తెలిపారు. తన పెళ్లి కూ డా ఇదే విధంగా జరిగిందని, మా ఊరులో నివసిస్తున్న ఈడిగ వర్గానికి చెందిన అన్ని జంటల వివాహాలు సామూహికంగానే జరగ డం విశేషమన్నారు. ఒక్క జంటకు కూడా విడిగా ఇప్పటి వరకు పెళ్లైన దాఖలాలు లేవు. ప్రతి ఏటా సామూహిక వివాహ వేడుకలను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అర్హులైన వధూవరులు ముందుగా నిశ్చయాలు చేసుకుని సామూహిక వేడుకల్లో మూడుముళ్లతో దంపతులవుతారు.  

పేదైనా..ధనికైనా ఒక్కటే 
ధనవంతులైనా, పేదవారైనా ఆ గ్రామంలోని ఒక సామాజిక వర్గంవారు సామూహిక పెళ్లి వేడుక నిర్వహించి అక్కడే అందరికీ టిఫిన్లు, భోజనాలు వడ్డించడం సంప్రదాయంగా వస్తుండడం విశేషం. దీంతో ఖర్చులు భారీగా తగ్గడంతో పాటు బంధుత్వాలు బలపడతాయి. చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు అసెంబ్లీ నియోజకవర్గం తళకు ఫిర్కా పరిధిలోని బెళ్లదారహట్టిలో ఈడిగ కులస్తులు పెళ్లిళ్లు సామూహికంగా చేసుకోవడం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. గ్రామంలో కనీసం రెండు మూడు పెళ్లిళ్లు కుదిరేవరకు వేచి చూస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement