వీడియో దృశ్యం
పూర్వం రాజులు పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకునే వారని విన్నాం.. పుస్తకాల్లో చదువుకున్నాం. రాజులు, రాజ్యాలు పోయినా పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకునే వాళ్లు నేటికీ అప్పుడప్పుడు దర్శనమిస్తూనే ఉన్నారు. సాటి మగాళ్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం దుబాయ్‌కి చెందిన ఓ పెద్దాయన తన 28 మంది భార్యల సమక్షంలో ఘనంగా 37వ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ కార్యక్రమంలో అతడి 135 మంది పిల్లలు, 126 మనవళ్లు, మనవరాళ్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన 45 సెకన్ల నిడివి కలిగిన ఓ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
‘‘జీవించి ఉన్న అత్యంత ధైర్య వంతుడు.. 28 మంది భార్యలు, 135 మంది పిల్లలు, 126 మంది మనవళ్లు, మనవరాళ్ల సమక్షంలో 37వ పెళ్లి’’ అనే శీర్షికను ఆయన జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ఒక్క భార్యతోనే వేగలేక చస్తుంటే నువ్వేంటి పెద్దాయన’’.. ‘‘నేనిప్పటి వరకు ఒక్క పెళ్లి చేసుకోవటానికే భయపడి చస్తున్నాను.. నువ్వు మాత్రం 37 పెళ్లిళ్లు చేసుకున్నావు’’... ‘‘ఇది చూస్తే సింగిల్స్ చచ్చిపోతారు’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment