ఏపీ అసెంబ్లీకి ‘పెళ్లి’ సెలవులు | 'marriage' holidays to AP Assembly | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీకి ‘పెళ్లి’ సెలవులు

Published Thu, Nov 23 2017 8:02 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

ఏపీ అసెంబ్లీకి ‘పెళ్లి’ సెలవులు ప్రకటించారు. గురువారం నుంచి శనివారం వరకు వరుసగా ముహూర్తాలున్నాయని, బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు హాజరుకావాల్సి ఉన్నందున సెలవులు ప్రకటించాలని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజుతో పాటు పలువురు టీడీపీ సభ్యులు బుధవారం అసెంబ్లీ జీరో అవర్‌లో డిమాండ్‌ చేశారు. 23, 24, 25 తేదీల్లో వరుసగా పలు పెళ్లిళ్లకు హాజరుకావాల్సి ఉన్నందున అసెంబ్లీ సమావేశాలకు విరామం ప్రకటించాలని విష్ణుకుమార్‌ రాజు కోరారు. దీనికి అధికార పక్ష సభ్యులంతా బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement