'నాస్తికులు ఉగ్రవాదులే!'
మీరు నాస్తికులా? దేవుడనేవాడే లేడని గట్టిగా నమ్ముతున్నారా? అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సౌదీ అరేబియాకి వెళ్లకండి. వెళ్లినా నోరు మూసుకుని ఉండండి. నాస్తికవాదం గురించిపొరబాటున కూడా మాట్లాడకండి. ఎందుకంటే తాజాగా సౌదీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు నాస్తికులంతా టెర్రరిస్టులే. నాస్తికవాదం పచ్చి ఉగ్రవాదం. కాబట్టి ఉగ్రవాదులకు ఏ శిక్ష పడుతుందో అదే శిక్ష దేవుడు లేడు అనేవాళ్లకీ పడుతుంది. అలాంటి వారు కనీసం ఇరవై ఏళ్లు కటకటాలు లెక్కించాల్సిందే.
అంతే కాదు. ఇస్లామ్ మౌలిక విశ్వాసాలను కాదనే వారెవరైనా ఉగ్రవాదులేనని ప్రభుత్వం తాజా ఆదేశాలు చెబుతున్నాయి. తమాషా ఏమిటంటే దేవుడు లేడన్న వాడిని ఉగ్రవాది అన్న సౌదీ అరేబియా ఈజిప్టులోని మత సంస్థ ఇస్లామిక్ బ్రదర్ హుడ్ ని కూడా ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.