atheist
-
గాంధేయ నిర్మాణ కార్యక్రమ సారథి ‘లవణం’
భారత స్వాతంత్య్ర సమ రంలోనే కాక, ఆ తర్వాత దేశ నిర్మాణ కార్యక్రమంలోనూ పొల్గొని సుదీర్ఘ కాలం దేశ సేవ చేసిన అరుదైన మనీషి లవణం. గాంధీజీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహ సమ యంలో (1930 అక్టోబర్ 10) జన్మించినందున ఆయనకు తండ్రి గోపరాజు రామచంద్రరావు (గోరా) ‘లవణం’ అని పేరు పెట్టారు. నాస్తికవాదిగా, గాంధేయవాదిగా; కుల, మత, వర్గ రహిత నవ సమాజ నిర్మాణానికి కంకణం కట్టుకొని ఆధ్యాత్మిక, ఆచార, సంప్రదాయాలను ఎదిరించి జీవితాంతం పని చేశారు లవణం.జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా గోరా పనిచేస్తున్న సమయంలో పదేళ్ల వయసు ఉన్న లవణం సేవాగావ్లో ఉండేవారు. ఆశ్రమానికి వచ్చిన అతిథులకు అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉండేవారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అపారమైన వాగ్ధాటి కలిగిన వ్యక్తి లవణం. చిన్నతనం నుండి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ అంచెలంచెలుగా విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ దేశ విదేశాలలో మానవతా, గాంధేయ వాదాలను ప్రచారం చేస్తూ తన జీవనాన్ని కొనసాగించారు. 1955లో ఆచార్య వినోబా భావే ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల పర్యటనలో చేసిన హిందీ ప్రసంగాలను సరళమైన తెలుగులోకి అనువదించారు. అలాగే సర్వోదయ సాహిత్యాన్ని హిందీ నుండి తెలుగులోకి అనువదించారు. భూదాన పత్రికకు సంపాదకులుగా ఉన్నారు.గుర్రం జాషువా కుమార్తె హేమలతతో వీరికి ఆదర్శ వివాహం జరిగింది. వీరిద్దరూ చంబల్ లోయ బందిపోట్లకు హృదయ పరివర్తన కల్పించే ఉద్యమంలో వినోబా, జయప్రకాశ్ నారాయణ్‌ల ప్రభావంతో మధ్య ప్రదేశ్‌లో పనిచేశారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో ‘జోగిని’ వ్యవస్థను రూపుమాపడానికి ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా కృషి చేశారు. స్టూవర్టుపురంలో పున రావాస కేంద్రాన్ని నెలకొల్పి అక్కడ ఖైదీలతో సహజీవనం కొనసాగిస్తూ వారిని దోపిడీలు, దొంగ తనాల నుంచి మరల్చారు. ప్రభుత్వంతో మాట్లాడి వారిపై కేసులను ఎత్తివేయించి వాళ్ల కాళ్లపై వారు నిలబడేలా సహాయ సహకారాలు అందించారు. ఆ విషయంలో హేమలత –లవణం దంపతుల సేవలు చిరస్మరణీయం. గాంధేయవాదం, సర్వోదయ, మానవతావాదాలను నమ్మిన వ్యక్తిగా లవణం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పర్యటించారు. అనేకమందిలో మార్పు తేవడానికి విశేష కృషిచేశారు. దండకారణ్యం, జార్ఖండ్ అడవు లను సైతం ఆరోగ్యం లెక్క చేయక తిరిగారు.చదవండి: అన్నాడంటే మాటపై ఉన్నాడనే!హేమలత మరణానంతరం (2008) లవణం చాలా విచారంతో నిస్సహాయ స్థితికి వెళ్లినా, నేను చేపట్టిన కార్యక్రమాలకు తప్పక హాజరవుతూ ప్రోత్సహించేవారు. గాంధేయ నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి విజయం సాధించినందుకు, గాంధీజీ ఆశయాలను ప్రజలకు.. ముఖ్యంగా యువత, విద్యార్థులకు అందిస్తున్నందుకు లవణానికి ప్రతిష్ఠాత్మకమైన ‘జాతీయ జమునాలాల్ బజాజ్’ అవార్డు లభించింది. అలాగే 2006లో నాగపూర్ విశ్వవిద్యాలయం వారి మహాత్మా గాంధీ అవార్డు ఆయన అందు కున్నారు. సంఘసంస్కర్త, ఆదర్శవాది, నాస్తికవాది, గాంధేయవాది అయిన లవణం చివరికి 2015 ఆగస్టు 14న తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత పరిస్థి తుల్లో ఆయన ఆశయాల కొనసాగింపు ఆవశ్యకత ఎంతైనా ఉంది.- జి.వి. సుబ్బారావు తెలంగాణ గాంధీ స్మారక నిధి అధ్యక్షులు -
హేతువాదమే మౌఢ్యానికి విరుగుడు
భారత హేతువాద సంఘాధ్యక్షుడు రావిపూడి వెంకటాద్రి తన 101వ సంవత్సరంలో పరమపదించారు. హేతువాదాన్నీ, మానవతావాదాన్నీ వ్యాపింప జేయడానికి దశాబ్దాలుగా వేలకొలదీ పేజీల ద్వారా అనంతమైన కృషి సల్పిన హేతువాది ఆయన. బౌద్ధాన్నీ, దాని హేతువాద దృక్పథాన్నీ నాశనం చేయడం కోసం రాజకీయ ఆధిపత్యం చలాయించిన శక్తుల దుర్మార్గాన్ని చారిత్రకాధారాలతో నిరూపించారు. అసహనం, ద్వేషాల వల్ల మత విశ్వాసాలు మారవని ఆయనకు స్పష్టంగా తెలుసు. మతమౌఢ్యం మారాలంటే మానసిక పరివర్తన రావాలనీ, అది చాలా నిదానమైన క్రమమనీ అంటారు. మను షుల్లో ఉన్న వివేచనా జ్ఞానాన్ని పని చేయించడం ద్వారానే మౌఢ్యాన్ని రూపుమాపవచ్చునన్నది హేతువాదుల నిశ్చితాభిప్రాయమని చెబుతారు. ‘‘వైజ్ఞానిక పునాదుల పైన, శాస్త్రీయ పరి జ్ఞానం పైన మాత్రమే మానవుల సుఖసంతో షాలు ఆధారపడి ఉంటాయి.’’ – స్వతంత్ర భారత తొలి ఉప రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణ కొన్ని శతాబ్దాల క్రితం వేమన, బద్దెన ఏ నీతులు శతక వాఙ్మయం ద్వారా బోధించారో వాటికి కాలం గడిచిన కొలదీ విలువ పెరుగు తూనే ఉంది. మూఢ విశ్వాసాల నుంచి ప్రజా బాహుళ్యానికి కొంత విమోచన వచ్చినా– పాలక శక్తుల ప్రాపకంతో సమాజంలో పెరు గుతూ వచ్చిన కుల, మత శక్తుల నుంచి విమోచన ఇంకా ప్రజలకు దూరంగానే ఉంది. ఎనిమిది దశాబ్దాలుగా తెలుగు ప్రజల్ని హేతువాదం ద్వారా నిరంతరం చైతన్యంతో రగిలించిన భారత హేతువాద సంఘాధ్య క్షుడు, ‘హేతువాది’ పత్రిక ప్రధాన సంపాదకులు, దార్శనికుడు రావి పూడి వెంకటాద్రి తన 101వ సంవత్సరంలో పరమపదించారు. నిష్క ల్మష హృదయంతో జీవితం సహేతుక పద్ధతిలో గడిపితే వ్యక్తి మనస్సు ముదిమిని జయిస్తుందని తన జీవితం ద్వారా నిరూపించారు వెంకటాద్రి. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమాలు, భారతీయ తత్వ దర్శనాలు, సత్యాన్వేషణ, ఆస్తికత్వం, నాస్తికత్వం, హేతుత్వం, మత తత్వం – ఆయన అన్వేషణా రంగాలు. హేతువాదాన్నీ, మానవతా వాదాన్నీ వ్యాపింపజేయడానికి వేలకొలదీ పేజీల ద్వారా వందలాది సంపుటాల ద్వారా అనంతమైన కృషి సల్పిన విస్పష్ట తొలి తెలుగు హేతువాది ఆయన. మహాకవి గురజాడ అప్పారావు 110 సంవత్సరాల నాడే – దేశవ్యాపితంగా ఖ్యాతి గడించిన బౌద్ధ ధర్మాన్ని కుల, మత స్వార్థపర వర్గాలు భారత సరిహద్దుల నుంచి ఎలా తరిమికొట్టాయో చెప్పారు. దేశంలోని బౌద్ధ ధర్మ, హేతువాద పీఠాల్ని బలవంతంగా కూల్చి, వాటి స్థానే హేతువాద విరుద్ధ క్షేత్రాలకు పాలకులు ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ‘క్రీ.శ. రెండు, మూడు శతాబ్దాల నాటికే’ కుల, మత వ్యవస్థకు పునాదులు గట్టిపరచుకొనే శక్తులకూ, బౌద్ధానికీ మధ్య జరిగిన సంఘర్షణకు ఆంధ్రలోని శ్రీ పర్వతమే కేంద్రం; బౌద్ధేతర శక్తులు బౌద్ధ భిక్షువులను వారి ఆరామాల నుండి బలవంతంగా బహి ష్కరించి, నాగార్జున కొండ వద్ద ఉన్న బౌద్ధారామాలను, విహారాలను ఎలా స్వాధీనం చేసుకున్నారో రావిపూడి వెంకటాద్రి నిరూపణలతో రుజువు చేశారు. క్రీస్తుపూర్వం శుంగుల కాలం నుంచి క్రీ.శ. ఏడవ శతాబ్దం దాకా బౌద్ధాన్నీ, దాని హేతువాద దృక్పథాన్నీ నాశనం చేయడం కోసం రాజకీయ ఆధిపత్యం చలాయించిన శక్తుల దుర్మా ర్గాన్ని చారిత్రకాధారాలతో రావిపూడి నిరూపించారు. చైనా యాత్రికు లైన– క్రీ.శ. 4వ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శించిన ఫాహియాన్ గానీ, 7వ శతాబ్దం నాటి హ్యుయాన్ త్సాంగ్ గానీ బౌద్ధుల మీద జరిగిన అనేక దాడుల వివరాలను ఎలా పేర్కొన్నారో వివరించారు. హేతువు మీద ఆధారపడి వర్ధిల్లిన లోకాయత, చార్వాక, బౌద్ధాది దర్శనాల్లోని హేతుబద్ధ భారతీయ తత్వాన్ని పతనం చేసిన తరు వాతనే భావవాదం, ఛాందసవాదానికి కొమ్ములు మొలవడం ప్రారంభించాయని రావిపూడి ఉదాహరించారు. సుప్రసిద్ధ చరిత్రకారుడు లక్ష్మీనరసు తన ‘బౌద్ధం అంటే ఏమిటి?’ గ్రంథంలో బౌద్ధ ధర్మసారం వివరించారు. ఆ సారాంశాన్ని ఆయన బుద్ధుని మాటల్లోనే చెప్పారు: ‘‘నేను బోధించే ధర్మం అందరి పట్ల సమాన ఆదరణ కల్గిన ధర్మం. దీన్ని మన, తన భేదం లేకుండా అందరికీ బోధించండి. ఇది మంచివారిని, చెడ్డవారిని, సంపన్నులను, పేదలను ఒకే విధంగా విముక్తి చేస్తుంది. దీని నుంచి ఎవరికీ ఎలాంటి మినహాయింపూ లేదు. కరుణామయులైనవారు తమను మాత్రమేగాక, ఇతరులనూ విముక్తి చేయాలని కోరుకుంటారు. ఎందరినో విముక్తి చేసినా, చెయ్యవల సింది మరెంతో ఉంటుంది. ఇది నిరంతరం కొనసాగవలసిన ప్రక్రియ. ఈ ధర్మం ప్రపంచమంతా వ్యాపించి దుఃఖసాగరంలో మునిగిన అందరినీ రక్షించాలి.’’ ప్రాచీన కాలంలోనే విజ్ఞాన కాంతుల్ని వెదజల్లుతూ, సంఘంలోని అజ్ఞానాంధకారాలను బట్టబయలు చేయడానికి బయల్దేరిన భావ విప్ల వోద్యమం వెయ్యేళ్లకుపైగా వర్ధిల్లి జన్మించిన భారతదేశంలోనే అడుగంటిపోవడం ఎంతటి విషాదకర పరిణామమో అంటారు రావిపూడి వెంకటాద్రి. ఇక కాలక్రమంలో బౌద్ధంలో చొరబడిన విగ్రహారాధన, పునర్జన్మ, కర్మ సిద్ధాంతాల వంటి మత వాసనలు కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడంతో తొలగిపోయి హేతువాద, మానవతావాదాలపై ఆధారపడిన సిసలైన బౌద్ధం వర్ధిల్లాలని రావిపూడి ఆశించారు. అందుకే ఒక సందర్భంలో ఇలా స్పష్టీకరించారు: ‘‘ఒక మతం వేరొక మతాన్ని ద్వేషిస్తుంది. కానీ హేతువాదం మతాలన్నింటినీ సమంగా నిరాకరిస్తుంది. అసహనాన్నీ, ద్వేషాన్నీ ప్రదర్శించదు. అసహనం, ద్వేషాల వల్ల మత విశ్వాసాలు మారవని హేతువాదులకు తెలుసు. మతమౌఢ్యం మారాలంటే మానసిక పరివర్తన రావాలనీ, అది చాలా నిదానమైన క్రమమనీ హేతువాదులకు తెలుసు. ఆంక్షల వల్ల, నిర్బంధాల వల్ల, నిరంకుశ నిషేధాల వల్ల మత తత్వం అణగిపోదనీ హేతువాదులకు తెలుసు. కనుకనే మనుషుల్లో ఉన్న వివేచనా జ్ఞానాన్ని పని చేయించడం ద్వారా మాత్రమే ఏ విధమైన మౌఢ్యాన్ని అయినా రూపుమాపవచ్చుననీ హేతువాదుల నిశ్చితా భిప్రాయం’’. అంతేకాదు– ‘‘జాతి, మత, కుల, వర్గ ప్రాతిపదికల మీద మనం ఆధారపడితే – విజ్ఞానం, తత్వం, స్వేచ్ఛ, సమత, న్యాయం, సౌభ్రా తృత్వం ప్రాతిపదికలుగా నిర్ణయించవలసిన మానవతావాద నీతి దుర్లభమవుతుంది. మానవులంతా ఒకటే అనుకున్నప్పుడు, మాన వుల మధ్య విభిన్నమయిన నీతులు ఉండటానికి వీల్లేదు... అంతే గాదు, నేటి జాతులన్నీ రక్త సాంకర్యం పొందినవే. సిద్ధాంత సాంకర్యం పొందినవే. వర్గాలన్నీ ఆర్థిక స్థాయీ సాంకర్యం పొంది ఉన్నవే. అందువల్ల భిన్న జాతి, మత వర్గాల మధ్య స్పష్టమైన విభజన రేఖ గీయడం సాధ్యం కాదు. అందువల్ల జాతి, మత వర్గాల పేర్లతో మనుషుల్ని విభజించడం హేతువిరుద్ధం. అలాంటి హేతు విరుద్ధమైన విభజనను సృష్టించినవారు ఆయా కాలాల్లో పాలక వర్గాలుగా (శాసకులుగా) పెంపొందిన బాపతే. వారు చిరంతన సత్యాలుగా పేర్కొన్న సిద్ధాంతాలన్నీ మానవుణ్ణి పెంపుడు జంతువుగా, సిద్ధాంతదాసుడిగా, డూడూ బసవన్నగా తయారు చేయడానికే దారి తీశాయి. కానీ, మనిషి పెంపుడు జంతువు కావడానికి స్వభావతః ఇష్ట పడడు కనుకనే ఎప్పటికప్పుడు వ్యవస్థీకృత సిద్ధాంతాల మీద తిరుగు బాటు చేస్తూ వచ్చాడు. అదే– భావ విప్లవమంటే’’ అన్నది రావిపూడి మాట! అందుకే కారల్ మార్క్స్ మహనీయుడు ‘మతం మత్తుమందు’ అని ఏనాడో నిర్వచించి పాఠం చెప్పవలసి వచ్చింది. ‘విజ్ఞానాభి వృద్ధితో పాటు పరిణామం చెందే ఆలోచనా వైఖరిగానే హేతువాదం వన్నె తేలుతుందనీ, ఆలోచనలోనూ, ఆచరణలోనూ హేతువాదం ఒక ఉద్యమమ’నీ వేయి విధాల నిరూపిస్తూ వచ్చాడు రావిపూడి వెంకటాద్రి! కనుకనే ఓ కవి కుమారుడున్నట్టు– ‘‘కలవరపడి వెనుదిరిగితె కాలం ఎగబడుతుంది కదనుతొక్కి చెలరేగితే కాలం భయపడుతుంది కర్మయోగి ఎన్నడూ కాలాధీనుడు కాదు – కనురెప్పలు మూతపడితె కాలం జోకొడుతుంది కంఠమెత్తి తిరగబడితే కాలం జేకొడుతుంది!’’ ఆఖరి శ్వాసలో కూడా స్థూలంగా అదే రావిపూడి తీర్మానం కూడా! -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
Ravipudi Venkatadri: రావిపూడి వెంకటాద్రి అస్తమయం
సాక్షి, బాపట్ల: హేతువాది మాసపత్రిక సంపాదకుడు రావిపూడి వెంకటాద్రి(101) ఇక లేరు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు చీరాలలో కన్నుమూశారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్లలో పుట్టిన రావిపూడి వెంకటాద్రి.. మూఢ నమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు చివరిదాకా ప్రయత్నించారు. మానవులకు మార్గదర్శిగా హేతువాదం చేయూతనిస్తోందనీ, మూఢనమ్మకాలతో సతమతమవుతోన్నవారికి వెలుగు చూపుతోన్నదని వెంకటాద్రి బలంగా నమ్మారు. ప్రశ్నించే వారంతా హేతువులను కోరుతున్నట్లే లెక్కేనని, దీనికి ఒక మతం ఉండదని చెబుతారు. కనిపించని దేవుడికంటే కనిపించే సాటి మనిషిని ప్రేమించమని చెప్పే రావిపూడి.. దాదాపు 80 పుస్తకాలు రాశారు. నాస్తికత్వం, ర్యాడికల్ హ్యుమనిజం, హేతువాదం, మతతత్వం, మానవవాదంల మీద ప్రధానంగా రాసిన పుస్తకాలలో కొన్ని విమర్శలకు గురయ్యాయి. మరికొన్ని ప్రజలకు దగ్గరయ్యాయి. ఎం.ఎన్. రాయ్ భావాలకు ఆకర్షితులైన రావిపూడి కొన్నాళ్లు ర్యాడికల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. కొన్నాళ్లు రాజకీయాల్లోనూ ఉన్నారు. దాదాపు 4 దశాబ్దాల పాటు నాగండ్ల గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. సంబంధిత వార్త: వంద వసంతాల హేతువాది.. రావిపూడి -
Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది
హేతువాద ఉద్యమానికి తెలుగునాట ప్రాచుర్య ప్రాశస్త్యాలను తీసుకువచ్చినవారు రావిపూడి వేంకటాద్రి. ఆయన నేడు 100 వసంతాలను పూర్తిచేసుకుని 101వ ఏట అడుగుపెడుతున్నారు. ఇది వ్యక్తిగతంగా ఆయనకూ, ఉద్యమపరంగా సమాజానికీ ఒక చారిత్రక ఘట్టం. 1922 ఫిబ్రవరి 9న ప్రకాశం జిల్లా నాగండ్లలో జన్మించిన వేంకటాద్రి 1943లో తన 21వ ఏటనే స్వగ్రామంలో ‘కవిరాజాశ్రమం’ స్థాపించారు. అంత చిన్నవయసులోనే సామాజిక, హేతువాద ఉద్యమాల ప్రముఖనేతలను తమ గ్రామానికి ఆహ్వానించి, ఉపన్యాసాలు ఇప్పించి, ప్రజల్లో చైతన్యబీజాలు నాటారంటే రావిపూడి శక్తిని అంచనా వేసుకోవచ్చు. అంతేకాదు. తన అభిమానకవి, ప్రముఖ హేతువాది త్రిపురనేని రామస్వామి పేర ‘కవిరాజు ట్యుటోరియల్స్’ స్థాపించి, మిత్రులతో కలిసి యువతలో శాస్త్రీయమైన ఆలోచనలను పెంచిన ఘనత కూడా వీరికే దక్కుతుంది. హేతువాద, మానవవాద, నాస్తికవాదాల గురించి 100కు పైగా ప్రామాణిక రచనలు చేశారు. ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళటానికి పత్రిక అవసరం గుర్తించి ‘హేతువాది’ మాసపత్రికను స్థాపించారు. నాటి నుండి నేటి వరకు నలభై ఏళ్లుగా సంపాదకులుగా వ్యవహరిస్తూ పత్రికను నిరాటంకంగా నడుపుతున్నారు. 76 ఏళ్ల క్రితం 1946లో ‘విశ్వాన్వేషణ’తో రచనా ప్రస్థానం ప్రారంభించి ఫిబ్రవరి 9, 2022న ఆవిష్కరిస్తున్న ‘లోకాయత చార్వాకం’తో 109 రచనలు చేసిన శతాధిక గ్రంథకర్తగా సరికొత్త రికార్డును సృష్టించారు వందేళ్ల రావిపూడి. (Bharat Bhushan: ఆదర్శ జీవితానికి కొలమానం) తెలుగునాట వందలమందిని శిష్యులుగా, ఉద్యమాభిమానులుగా తీర్చిదిద్దారు. హేతువాదులు సమాజహిత వాదులని నిరూపించారు. మానవతావాదం కంటే మానవవాదం ముఖ్యమనే సరికొత్త భావజా లాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. మూక ఉద్యమాలు, మూస ఉద్యమాలు ప్రజల్లో మాస్ హిస్టీరియాను పెంచుతాయనీ, హేతువాద, మానవవాదాలు ప్రజలను ఆలోచనా మార్గంలో నడుపుతాయనీ అంటారు రావిపూడి. మాస్టారును పద్మశ్రీలు వరించక పోవచ్చు. ఆయనకు గౌరవ డాక్టరేట్లు రాకపోవచ్చు. కానీ వందేళ్ల ఆయన అలుపెరుగని జీవితం సమాజానికి తరగని ఆస్తి. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిదీ! (Bhimsen Joshi: శతవసంత స్వరమాధురి) – బీరం సుందరరావు హేతువాద ఉద్యమ నాయకులు (నేడు రావిపూడి వేంకటాద్రి 101వ జన్మదినోత్సవం) -
ఏపీ ఎన్నికల ఫలితాలు చెప్తే భారీ నజరానా!
సాక్షి, విజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ రేపుతున్న ఎన్నికలపై భారత నాస్తిక సమాజం ఆసక్తికర సవాల్ విసిరింది. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ముందుగానే చెప్పిన జ్యోతిష్యులకు రూ.5 లక్షలు బహుమతిగా అందజేస్తామని భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు టి.శ్రీరామ్మూర్తి, జిల్లా అధ్యక్షుడు వై.నూకరాజు శుక్రవారం ఒక ప్రకటనలో సవాల్ విసిరారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో కొంతమంది జ్యోతిష్యం పేరిట ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 51 ప్రకారం ప్రజల్లో శాస్త్రీయ స్పృహను పెంపొందించడం ప్రతి భారతీయుని విధి అని, అందుకు విరుద్ధంగా కొందరు రాజకీయ నాయకులు, అధికారులు ప్రవర్తించడం శోచనీయమన్నారు. ఈ నెల 23న వచ్చే ఫలితాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ముందుగా చెప్పిన వారికి రూ.5 లక్షలు బహుమతి అందిస్తామన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకుడు మురపాక కాళిదాస్ నాడీ జ్యోతిష్యం ప్రకారం వైఎస్సార్సీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని గతవారంలో చెప్పారని, ఆయన కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. సందేహాలుంటే 94402 60280, 90106 96498 నంబర్లను సంప్రదించాలన్నారు. -
ఏంటా ఆశ్చర్యం?
ఓ గురువు తన శిష్యులకు పాఠం చెబుతున్నారు.అప్పుడు ఓ నాస్తికుడు అక్కడికి వచ్చాడు. ఆ గురువుగారి తీరుతెన్నులను, విధానాలను కించపరుస్తూ మాట్లాడాడు. అవమానపరిచాడు. ఇదంతా అక్కడున్న శిష్యులు చూస్తూనే ఉన్నారు. వారికేమీ బోధపడలేదు. ఎందుకంటే అతనిని అంతకుముందెన్నడూ వారెవరూ చూడలేదు. తమ గురువుగారు ఎవరితోనూ గొడవపడటం కానీ వాదులాటకు దిగటం కానీ ఎప్పుడూ చూడలేదు. అసలాయనలో కోపమే ఎరుగరు. అటువంటిది ఎవరో ఓ అజ్ఞాత వ్యక్తి వచ్చీరావడంతోనే రెచ్చిపోవడం వారికి విచిత్రంగా చూస్తున్నారు. గురువుగారు ఎలా స్పందిస్తారోనని వారిలో ఆసక్తి పెరిగింది.మనసుకి ఏదనిపిస్తే అది మాట్లాడుతూ వచ్చిన ఆ నాస్తికుడు ‘‘మిమ్మల్ని ఓ బౌద్ధ భిక్షువుగానో లేక జెన్ గురువుగానో నేనెందుకు స్వీకరించాలి... ఎందుకు నమస్కరించాలి’’ అని అడిగాడు కటువుగా.అతనలా అంటున్నప్పటికీ ఆ గురువుగారేమీ ఆగ్రహించలేదు. రెచ్చిపోలేదు. అతని మాటలను ఖండించలేదు. అతనితో ఎంతోమర్యాదగానే మాట్లాడుతూ, ‘‘మీరు చెప్పిందల్లా నిజమే. మీ సిద్ధాంతాలనూ మీ నమ్మకాలనూ నేను ఎందుకు కాదంటాను....మీ దారి మీది. నా దారి నాది. నేనేమీ మీ అభిప్రాయాలకు అడ్డురాను.కానీ ఒక్క విషయం... నేనే కాదు నాలాంటివారు ఓ ఆశ్చర్యాన్ని చెయ్యగలరు’’ అన్నారా గురువు.‘‘అదేంటీ’’ అని అడిగాడు నాస్తికుడు.గురువుగారు ప్రశాంత చిత్తంతో ఇలా అన్నారు...‘‘ఎవరైనా తప్పు చేసినా, మాకు ద్రోహం చేసినా, అవమానించినా వారిపై మేము మండిపడం. కోప్పడం. ద్వేషం పెంచుకోము. వారి మాటలను అప్పటికప్పుడే మరచిపోతాము. అంతే తప్ప వాటిని మనసులో ఉంచుకుని లోలోపల రగిలిపోము....’’ అని చెప్పారు.అందుకే అంటారు జ్ఞానుల దగ్గర ఒకరిని క్షమించిన వాటి నీడలు కూడా చూడలేమని. – యామిజాల జగదీశ్ -
'నాస్తికులు ఉగ్రవాదులే!'
మీరు నాస్తికులా? దేవుడనేవాడే లేడని గట్టిగా నమ్ముతున్నారా? అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సౌదీ అరేబియాకి వెళ్లకండి. వెళ్లినా నోరు మూసుకుని ఉండండి. నాస్తికవాదం గురించిపొరబాటున కూడా మాట్లాడకండి. ఎందుకంటే తాజాగా సౌదీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు నాస్తికులంతా టెర్రరిస్టులే. నాస్తికవాదం పచ్చి ఉగ్రవాదం. కాబట్టి ఉగ్రవాదులకు ఏ శిక్ష పడుతుందో అదే శిక్ష దేవుడు లేడు అనేవాళ్లకీ పడుతుంది. అలాంటి వారు కనీసం ఇరవై ఏళ్లు కటకటాలు లెక్కించాల్సిందే. అంతే కాదు. ఇస్లామ్ మౌలిక విశ్వాసాలను కాదనే వారెవరైనా ఉగ్రవాదులేనని ప్రభుత్వం తాజా ఆదేశాలు చెబుతున్నాయి. తమాషా ఏమిటంటే దేవుడు లేడన్న వాడిని ఉగ్రవాది అన్న సౌదీ అరేబియా ఈజిప్టులోని మత సంస్థ ఇస్లామిక్ బ్రదర్ హుడ్ ని కూడా ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.