శాంతికి చిహ్నం ఇస్లాం
గోనెగండ్ల: ఇస్లాం మతం శాంతికి చిహ్నమని ముస్లిం మత పెద్ద మౌలానా జాకీర్ అహమ్మద్ రషాది పేర్కొన్నారు. గోనెగండ్ల సమీపంలో రెండురోజులపాటు నిర్వహించే జిల్లా స్థాయి ఇస్తెమా శనివారం ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుండి కూడా వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. మతపెద్దలు ఇస్తెమాను దువాతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవం సష్టించినవన్నీ మానవళికి ఉపయోగపడేవే అన్నారు. ఇస్తెమాలో మత పెద్దలు మౌలానా యాషిన్‌సాబ్, మౌలానా సలీం సాబ్, మౌలానా సత్తార్‌సాబ్, మౌలానా జుబేర్ సాబ్‌లు ప్రసంగించారు.