ijtema
-
'తెలుగు ప్రజలపై అల్లాహ్ దయ ఉండాలని ప్రార్ధిస్తున్నా'
సాక్షి, హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇజ్తిమా శుభాకాంక్షలు తెలిపారు. 'అంతర్జాతీయ ఇజ్తిమా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న ముస్లిం సోదరులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఎల్లవేళలా మన తెలుగు రాష్ట్రాల ప్రజల మీద అల్లాహ్ దయ ఉండాలని ప్రార్ధిస్తున్నాను' అని ట్విటర్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇజ్తిమా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న ముస్లిం సోదరులకు నా హృదయ పూర్వక శుభా కాంక్షలు. ఎల్లవేళలా మన తెలుగు రాష్ట్రాల ప్రజల మీద అల్లాహ్ దయ ఉండాలని ప్రార్ధిస్తున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) December 10, 2018 -
దైవచింతనతో ముక్తి
– ఇస్తెమాకు వేలాదిగా తరలివచ్చిన ముస్లింలు – ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ బుట్టా రేణుక గోనెగండ్ల: దైవచింతన తో ముక్తి లభిస్తుందని ముస్లిం మతపెద్దలు చెప్పారు. మండల కేంద్రం గోనెగండ్ల సమీపంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఇస్తెమా ఆదివారం రాత్రి ముగిసింది. చివరిరోజు వేలాది మంది ముస్లింలు ఇస్తేమాకు తరలి వచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఇస్తేమాలో మత పెద్దలు మౌలానా జాకీర్ అహమ్మద్ రషాది ,మౌలానా యాషిన్సాబ్, మౌలానా సలీం సాబ్, మౌలానా సత్తార్‌సాబ్, మౌలానా జుబేర్ సాబ్‌లు మాట్లాడుతూ ప్రతి ముస్లిం ప్రవక్త మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో ఇస్తెమా నిర్వాహకులు సీనియర్ న్యాయవాది హైదర్అలీ, సలాంసాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ: గోనెగండ్లలో జరిగిన ఇస్తెమాకు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బుట్టా రేణుక, వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజవర్గ ఇన్చార్జ్ హఫీజ్‌ఖాన్ హాజరై ఏర్పాట్లను పరిశీలించారు. ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. దైవ సంబంధ కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని మత పెద్దలకు ఆమె హమి ఇచ్చారు. ఆమె వెంట స్థానిక ఎంపీపీ నసరుద్దీన్, డాక్టర్ ఉస్మాన్, సలాం సాహెబ్, తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి ఇస్తెమాకు వచ్చి ఏర్పాట్లను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. -
శాంతికి చిహ్నం ఇస్లాం
గోనెగండ్ల: ఇస్లాం మతం శాంతికి చిహ్నమని ముస్లిం మత పెద్ద మౌలానా జాకీర్ అహమ్మద్ రషాది పేర్కొన్నారు. గోనెగండ్ల సమీపంలో రెండురోజులపాటు నిర్వహించే జిల్లా స్థాయి ఇస్తెమా శనివారం ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుండి కూడా వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. మతపెద్దలు ఇస్తెమాను దువాతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవం సష్టించినవన్నీ మానవళికి ఉపయోగపడేవే అన్నారు. ఇస్తెమాలో మత పెద్దలు మౌలానా యాషిన్సాబ్, మౌలానా సలీం సాబ్, మౌలానా సత్తార్‌సాబ్, మౌలానా జుబేర్ సాబ్‌లు ప్రసంగించారు.