ఇస్తెమాలో ఉచిత వైద్య శిభిరంలో అందిస్తున్న వైద్య సేవలగురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్న ఎంపీ
దైవచింతనతో ముక్తి
Published Sun, Sep 18 2016 11:25 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
– ఇస్తెమాకు వేలాదిగా తరలివచ్చిన ముస్లింలు
– ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ బుట్టా రేణుక
గోనెగండ్ల: దైవచింతన తో ముక్తి లభిస్తుందని ముస్లిం మతపెద్దలు చెప్పారు. మండల కేంద్రం గోనెగండ్ల సమీపంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఇస్తెమా ఆదివారం రాత్రి ముగిసింది. చివరిరోజు వేలాది మంది ముస్లింలు ఇస్తేమాకు తరలి వచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఇస్తేమాలో మత పెద్దలు మౌలానా జాకీర్ అహమ్మద్ రషాది ,మౌలానా యాషిన్‌సాబ్, మౌలానా సలీం సాబ్, మౌలానా సత్తార్‌సాబ్, మౌలానా జుబేర్ సాబ్‌లు మాట్లాడుతూ ప్రతి ముస్లిం ప్రవక్త మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో ఇస్తెమా నిర్వాహకులు సీనియర్ న్యాయవాది హైదర్‌అలీ, సలాంసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ:
గోనెగండ్లలో జరిగిన ఇస్తెమాకు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బుట్టా రేణుక, వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజవర్గ ఇన్‌చార్జ్ హఫీజ్‌ఖాన్ హాజరై ఏర్పాట్లను పరిశీలించారు. ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. దైవ సంబంధ కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని మత పెద్దలకు ఆమె హమి ఇచ్చారు. ఆమె వెంట స్థానిక ఎంపీపీ నసరుద్దీన్, డాక్టర్ ఉస్మాన్, సలాం సాహెబ్, తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి ఇస్తెమాకు వచ్చి ఏర్పాట్లను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు.
Advertisement