మహోన్నత మానవతా ధర్మం ఇసా్లం
మహోన్నత మానవతా ధర్మం ఇసా్లం
Published Mon, Jan 9 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM
–సున్ని ఇస్తెమాలో ముస్లిం మత పెద్దలు పిలుపు
- భారీగా హాజరైన ముస్లింలు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మానవుల్లో ప్రేమానురాగాల బంధాలను బలోపేతం చేసే మహోన్నత మానవతా ధర్మం ఇస్లాం అని వివిధ దర్గాల పీఠాధిపతులు, ముస్లిం మత పెద్దలు అన్నారు. అహ్లె సున్నతుల్ జమాత్, మర్కజీ మిలాద్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు నగరలోని ఉస్మానియా కళాశాల మైదానంలో లతీఫ్ లావుబాలి దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా అబ్దుల్లా హుసేన్ బాద్‌షా ఖాద్రి అధ్యక్షతన జాతీయస్థాయి సున్ని ఇస్తెమా జరిగింది.
జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు ఉల్మాలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎంపీలు బుట్టారేణుక, టీజీ వెంకటేష్ , ఆదోని, మంత్రాలయం, కర్నూలు ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, ఎస్వీమోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలునియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, హాజరయ్యారు.అనంతరం అజ్మీర్ దర్గా గుడ్డీ నషీన్ మౌలానా సయ్యద్ ఫజ్‌లుల్ మతీన్, గుల్బర్గా దర్గా సజ్జాదే నషీన్ సయ్యద్‌షా గౌస్‌దరాజ్ ఖుస్రూ హుసేని, దాదాహయాత్ ఖలందర్ దర్గా (కర్ణాటక) పీఠాధిపతి సయ్యద్ గౌస్ మొహియుద్దీన్ ఖాద్రి, మౌలానా రిజ్వాన్ పాషా ఖాద్రి, మౌలానా అహ్మద్ నక్స్‌బందీ, డాక్టర్ ఇస్మాయిల్ పీర్ ఖాద్రి ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. మానవాళి శ్రేయస్సును కాంక్షించి భువిపైకి వచ్చిన పవిత్ర గ్రంధం ఖురాన్ అని, మానవాళి ఎలా నడుచుకోవాలో అందులో పొందుపరిచారన్నారు. అల్లా ఆదేశాలను ఆచరించి చూపిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త (సఅస) అంటూ ఆయన జీవిత విశేషాలను వివరించారు. ప్రతి ముస్లిం ప్రవక్త మార్గంలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఇస్తెమాలో అహ్లె సున్నతుల్ జమాత్ జిల్లా కార్యదర్శి సయ్యద్‌షా షఫి పాషా ఖాద్రి, ప్రతినిధులు సయ్యద్ ముర్తుజా ఖాద్రి, మాసుంపీర్ ఖాద్రి, డాక్టర్ సరఫరాజ్, సయ్యద్ జహీర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
పీఠాధిపతుల ఆశీస్సులు పొందిన ఎంపీ బుట్టా రేణుక..
ఇసె్తమాకు హాజరైన కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పీఠాధిపతులు, మతపెద్దలు, ఉల్మాల ఆశీస్సులు పొందారు. కర్నూలులో జాతీయ స్థాయి ఇస్తెమా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మానవాళి శ్రేయసే్స అన్ని మత గ్రంథాల సారంశం అని ఎంపీ టీజీ, ఎమ్మెల్యే ఎస్వీ పేర్కొన్నారు. అందరికి మంచి జరగాలని ఇస్తెమాలో దువా చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మతపెద్దలకు విజ్ఞప్తి చేశారు.
ఇస్తెమా నిర్వాహకులకు సత్కారం
భారీ ఎత్తున సున్ని ఇస్తెమా నిర్వహించిన షఫిపాషా ఖాద్రిని ఇతర మతపెద్దలను మంత్రాలయం, ఆదోని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి సత్కరించారు.
Advertisement