istema
-
పాపిష్టి పనులు చేస్తే నమాజు వృథా
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పాపిష్టి సొమ్ముతో సిద్ధం చేసిన ఆహారాన్ని ఒక్కసారి ఆరగించినా 40 రోజుల నమాజు వృథాగా పోతుందని తబ్లీగ్ జమాత్ ప్రముఖుడు హజ్రత్‌జీ సాద్ సాహబ్ ముస్లింలకు హితబోధ చేశారు. కర్నూలు నగర శివారు నన్నూరు టోల్గేట్ వద్ద 1,250 ఎకరాల్లో ఈనెల 7న జుమ్మానమాజుతో ప్రారంభమైన అంతర్జాతీయ ఇస్తెమా సోమవారం హజ్రత్‌జీ ప్రసంగం, దువాతో ముగిసింది. చివరి రోజున జనంతో ఇస్తెమా మైదానం పట్టలేదు. ఇస్తెమాకు సుమారు 40 లక్షల మంది హాజరై ఉంటారని నిర్వాహకులు అంచనా వేశారు. ఈ సందర్భంగా హజ్రత్‌జీ మాట్లాడుతూ విద్య లేని వారు అంధులతో సమానమని, అందరూ విద్యను తప్పకుండా నేర్చుకోవాలని, ఖురాన్‌ను ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండాలని సూచించారు. మసీదుల్లో నమాజు చేయించడం ఒక్కటే కాకుండా ఇమామ్‌లు ఖురాన్ నేర్పడం కూడా బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనంతరం సర్వమానవాళి శ్రేయస్సు కోరుతూ దువా చేశారు. ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన హజ్రత్‌జీ ప్రసంగం మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి దువాతో ఇస్తెమా ముగిసింది. ప్రణాళిక ప్రకారం నిష్క్రమణ.. నలభై లక్షల మంది ఒకేసారి రోడ్డు మీదికి రావడం కష్టసాధ్యం కావడంతో మొదటి అరగంట వరకు పాదచారులను, రెండో అరగంటలో ద్విచక్ర వాహనా లను, ఆ తర్వాత అరగంటకు నాలుగు చక్రాల వాహ నాలను, అటు తర్వాత భారీ వాహనాలను పంపిం చారు. ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బయటికి వచ్చిన తర్వాత కూడా వలంటీర్లు పోలీసులకు సహకరించారు. ఇస్తెమాలో డిప్యూటీ సీఎంలు కె.ఇ.కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు ఎన్.ఎం.డి.ఫరూక్, కాలవ శ్రీనివాసులు, అఖిలప్రియ, ఎమ్మెల్సీ షరీఫ్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఇస్తెమా సందర్భంగా ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: తబ్లీగ్ ఏ జమాత్ ఆధ్వర్యంలో కర్నూలులో జరిగిన అంతర్జాతీయ ఇస్తెమాకు హాజరైన ముస్లిం సోదరులకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘అంతర్జాతీయ ఇస్తెమా కార్యక్ర మాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్న ముస్లిం సోదరులకు నా హృదయపూర్వక శుభా కాంక్షలు తెలియజేస్తున్నాను. ఎల్లవేళలా మన తెలుగు రాష్ట్రాల ప్రజల మీద అల్లాహ్ దయ ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు. -
సమాజ పరివర్తన కోసం ఇస్లాం ధర్మం
కర్నూలు(కల్చరల్)/ఓల్డ్‌సిటీ: మానవ సమాజ పరివర్తన కోసం మహమ్మద్ ప్రవక్త తన జీవితాన్ని అంకితం చేసి ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేశారని, ఆ ధర్మాన్ని ముస్లింలు తమ జీవన గమనంలో పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని మౌలానా (మతపెద్ద) జంషెద్ తెలిపారు. కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద తబ్లీగ్ జమాత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇస్తెమా రెండో రోజున మధ్యాహ్నం జోహర్ నమాజ్ అనంతరం మౌలానా జంషెద్ ప్రవచనాన్ని బోధిస్తూ ఇస్లాం ధర్మ విశిష్టతను తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త సూచించిన విధానంలో నిఖా చేయడం మేలైన మార్గమని, అనవసర ఖర్చులు ఆయన విధానం కాదని తబ్లీగ్ జమాత్ ప్రముఖుడు హజరత్‌జీ సాద్‌సాహబ్ ముస్లింలకు సూచించారు. ఆదివారం సాయంత్రం ఆయన సమక్షంలో సామూహిక వివాహాలు జరిగాయి. రెండో రోజున భారీగా తరిలి వచ్చిన జనం కర్నూలులో జరుగుతున్న ఇస్తెమాకు దేశం నలుమూల నుంచి ఉప్పెనలా జనం కదిలి వచ్చారు. ఇస్తెమా ప్రాంగణంలో భక్తులే కాకుండా రాజస్తాన్, బిహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు సైతం తరిలి వచ్చి అరుదైన వస్తులు విక్రయిస్తున్నారు. రెండో రోజు ఇస్తెమా.. హజ్ యాత్రను తలపించిందని పలువురు భక్తులు తెలిపారు. సోమవారం హజ్రత్‌జీ ప్రసంగం తరువాత దువా కార్యక్రమంతో ఇస్తెమా ముగుస్తుంది. ఇస్తెమాలో వైఎస్సార్సీపీ నాయకులు ఇస్తెమాకు వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు భారీ సంఖ్యలో ఆదివారం హాజరయ్యారు. విజయవాడ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాదర్‌బాషా, షఫీ పాల్గొన్నారు. -
ఇస్తెమాకు పోటెత్తిన జనం!
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఏపీలోని కర్నూలు నగర శివారు నన్నూరు టోల్గేట్ వద్ద నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఇస్తెమాకు శనివారం జనం పోటెత్తారు. దేశ విదేశాల నుంచి ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో నగరానికి చేరుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆదివారం రద్దీ మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ స్థాయి ఇస్తెమాకు హాజరవుతున్న వారికి సేవలందించేందుకు స్థానిక ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. శనివారం హజ్రత్‌జీతో పాటు మౌలానా జంషేద్, మౌలానా యూసుఫ్, ముఫ్తి షాజాద్, భాయ్ ఇక్బాల్ హఫీజ్, మౌలానా ముస్తఖీమ్, మౌలానా సయీద్, మౌలానా షౌకత్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇస్తెమా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతీరోజు మగ్రిబ్ నమాజ్ తర్వాత హజ్రత్‌జీ బయాన్ ఉంటుందని తెలిపారు. నేడు సామూహిక వివాహాలు ఆదివారం సాయంత్రం అసర్ నమాజు తర్వాత ఇస్తెమాయీ షాదియాన్ (సామూహిక వివాహాలు) నిర్వహించనున్నట్లు ఇస్తెమా కమిటీ సభ్యులు తెలిపారు. హజ్రత్‌జీ సమక్షంలో రెండు వందలకు పైగానే నిఖాలు జరుగుతాయని తెలిపారు. -
మహోన్నత మానవతా ధర్మం ఇసా్లం
–సున్ని ఇస్తెమాలో ముస్లిం మత పెద్దలు పిలుపు - భారీగా హాజరైన ముస్లింలు కర్నూలు (ఓల్డ్‌సిటీ): మానవుల్లో ప్రేమానురాగాల బంధాలను బలోపేతం చేసే మహోన్నత మానవతా ధర్మం ఇస్లాం అని వివిధ దర్గాల పీఠాధిపతులు, ముస్లిం మత పెద్దలు అన్నారు. అహ్లె సున్నతుల్ జమాత్, మర్కజీ మిలాద్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు నగరలోని ఉస్మానియా కళాశాల మైదానంలో లతీఫ్ లావుబాలి దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా అబ్దుల్లా హుసేన్ బాద్షా ఖాద్రి అధ్యక్షతన జాతీయస్థాయి సున్ని ఇస్తెమా జరిగింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు ఉల్మాలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎంపీలు బుట్టారేణుక, టీజీ వెంకటేష్ , ఆదోని, మంత్రాలయం, కర్నూలు ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, ఎస్వీమోహన్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ కర్నూలునియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, హాజరయ్యారు.అనంతరం అజ్మీర్ దర్గా గుడ్డీ నషీన్ మౌలానా సయ్యద్ ఫజ్లుల్ మతీన్, గుల్బర్గా దర్గా సజ్జాదే నషీన్ సయ్యద్‌షా గౌస్దరాజ్ ఖుస్రూ హుసేని, దాదాహయాత్ ఖలందర్ దర్గా (కర్ణాటక) పీఠాధిపతి సయ్యద్ గౌస్ మొహియుద్దీన్ ఖాద్రి, మౌలానా రిజ్వాన్ పాషా ఖాద్రి, మౌలానా అహ్మద్ నక్స్‌బందీ, డాక్టర్ ఇస్మాయిల్ పీర్ ఖాద్రి ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. మానవాళి శ్రేయస్సును కాంక్షించి భువిపైకి వచ్చిన పవిత్ర గ్రంధం ఖురాన్ అని, మానవాళి ఎలా నడుచుకోవాలో అందులో పొందుపరిచారన్నారు. అల్లా ఆదేశాలను ఆచరించి చూపిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త (సఅస) అంటూ ఆయన జీవిత విశేషాలను వివరించారు. ప్రతి ముస్లిం ప్రవక్త మార్గంలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఇస్తెమాలో అహ్లె సున్నతుల్ జమాత్ జిల్లా కార్యదర్శి సయ్యద్‌షా షఫి పాషా ఖాద్రి, ప్రతినిధులు సయ్యద్ ముర్తుజా ఖాద్రి, మాసుంపీర్ ఖాద్రి, డాక్టర్ సరఫరాజ్, సయ్యద్ జహీర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. పీఠాధిపతుల ఆశీస్సులు పొందిన ఎంపీ బుట్టా రేణుక.. ఇసె్తమాకు హాజరైన కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పీఠాధిపతులు, మతపెద్దలు, ఉల్మాల ఆశీస్సులు పొందారు. కర్నూలులో జాతీయ స్థాయి ఇస్తెమా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మానవాళి శ్రేయసే్స అన్ని మత గ్రంథాల సారంశం అని ఎంపీ టీజీ, ఎమ్మెల్యే ఎస్వీ పేర్కొన్నారు. అందరికి మంచి జరగాలని ఇస్తెమాలో దువా చేయాలని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మతపెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఇస్తెమా నిర్వాహకులకు సత్కారం భారీ ఎత్తున సున్ని ఇస్తెమా నిర్వహించిన షఫిపాషా ఖాద్రిని ఇతర మతపెద్దలను మంత్రాలయం, ఆదోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి సత్కరించారు. -
సున్ని ఇస్తెమాకు సర్వం సిద్ధం
కర్నూలు(ఓల్డ్‌సిటీ): అహ్లె సున్నతుల్ జమాత్, మర్కజీ మిలాద్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులో జాతీయ స్థాయి ఒక్కరోజు సున్ని ఇస్తెమా నిర్వహించనున్నారు. ఇస్తెమా ఫజర్ నమాజ్(తెల్లవారు జామున 6.00)కు మొదలై ఇషా నమాజ్ (రాత్రి 8.30) వరకు ఉంటుంది. రాష్ట్ర, అంతర్రాష్ట్ర ఉల్మాలు (ఆధ్యాత్మిక , దర్గాల పీఠాధిపతులు వక్తలుగా పాల్గొంటున్నారు. స్థానిక ఉస్మానియా కళాశాల మైదానంలో సుమారు 60 వేల మంది కూర్చునేందుకు వీలుగా షామియానా, కుర్చీలు తదితర ఏర్పాట్లు చేశారు. మనరాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ముస్లింలకు ఆకట్టుకునేలా ఐదు ప్రవేశ ద్వారాలు, వచ్చిన వారికి టిఫిన్లు, భోజనాలు వడ్డించేందుకు వీలుగా ప్రత్యేక వంట శాల విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇస్తెమాకు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు అహ్లెసున్నతుల్ జమాత్ జిల్లా కార్యదర్శి సయ్యద్‌షా షఫిపాషా ఖాద్రి తెలిపారు. అజ్మీర్ దర్గా సజ్జాదే నషీన్ సయ్యద్ ఫజ్లుల్ మతీన్, గుల్బర్గా దర్గా సజ్జాదే నషీన్ సయ్యద్ ఖుస్రూ హుసేని ప్రసంగిస్తారన్నారు. ఐదు పూటలా నమాజులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఏర్పాట్లలో అహ్లె సున్నతుల్ జమాత్ సంయుక్త కార్యదర్శి సయ్యద్ ముర్తుజా ఖాద్రి కూడా ఉన్నారు.