ఇస్లాంలోకి యువన్ శంకర్ రాజా!
ఇస్లాంలోకి యువన్ శంకర్ రాజా!
Published Tue, Feb 11 2014 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
చాలా మంది తమకు నచ్చిన మతంలోకి మారుతుంటారు. ఇం దుకు పలు కారణాలుంటాయి. సెలబ్రెటీలు మతం మారడంపై ఉత్సుకత ఏర్పడడం సహజం. అలాంటి ఆసక్తినే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా విషయంలో నెలకొంది. ఈయన హిం దూ మతం నుంచి ఇస్లామ్ మతంలో కి మారారు. యువన్ శంకర్ రాజా కుటుంబ నేపథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంగీత చక్రవర్తి ఇళయ రాజా ముగ్గురు సంతానంలో యువన్ శంకర్ రాజా ఒకరు. మొదటి కొడుకు కార్తీక్ రాజా. వీరికి చెల్లెలు భవతారిణి. ఈ ముగ్గురు తండ్రి బాటలోనే పయనించడం విశేషం.
యువన్ శంకర్ రాజా వైవాహిక జీవితం ఒడిదుడుకుల్లో సాగుతోంది. ఆయన మొదట సుజయ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. దీంతో యువన్ ఆ తర్వాత శిల్ప అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారు. ఇది పెద్దల అనుమతితో తిరుమలలో జరిగింది. తాజాగా అది కలహాల కాపురంగా మారడంతో ఇద్దరూ విడిపోయూరని సమాచారం. ఇప్పుడు ముస్లిం యువతిని మూడో పెళ్లి చేసుకోవడానికి యువన్ ఇస్లాం మతం స్వీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంగీత దర్శకుడిప్పుడు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తున్నారట. ఖురాన్ చదువుతున్నారట. దీని గురించి యువన్ శంకర్ రాజా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాను ఇస్లాం మతంలోకి మారిన విషయం నిజమేనని, మూడవ పెళ్లి కోసం మాత్రం కాదని వివరించారు.
Advertisement
Advertisement