సినిమా తీస్తానంటున్న యువన్ | Yuvan shankar raja directs movies | Sakshi
Sakshi News home page

సినిమా తీస్తానంటున్న యువన్

Dec 1 2015 8:36 AM | Updated on Aug 9 2018 7:30 PM

సినిమా తీస్తానంటున్న యువన్ - Sakshi

సినిమా తీస్తానంటున్న యువన్

మంచి కథ లభిస్తే సినిమా తీస్తానంటున్నారు యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా.

చెన్నై :  మంచి కథ లభిస్తే సినిమా తీస్తానంటున్నారు యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. సంగీత దర్శకులు నిర్మాతలుగా మారుడం ఇవ్వాళ కొత్తేమీ కాదు. సంగీత జ్ఞాని ఇళయరాజా కూడా నిర్మాతగా చిత్రాలు చేశారు. ఇక ఈ తరం విషయానికి వస్తే సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని నిర్మాతగా మారడంతో పాటు కథానాయకుడిగాను విజయాలను అందుకుంటున్నారు. అదే విధంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ కూడా చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
తన చిత్రానికి తనే కథను సిద్ధం చేసుకుంటున్నారు కూడా. తాజాగా మరో ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కూడా నిర్మాతనవుతానంటున్నారు. ఈయన ఇటీవల ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ తనకు నటుడవ్వాలనే కోరిక ఇంత వరకూ కలగలేదన్నారు. అయితే నిర్మాతగా చిత్రాలు చేయాలనే ఆశ మాత్రం ఏర్పడిందని అన్నారు.

అందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మంచి కథ లభిస్తే వెంటనే సినిమా తీస్తానని యువన్ అన్నారు. మరో విషయం ఏమిటంటే తనకు పరిపూర్ణ విజయం లభించిదని భావించడం లేదు. అలాంటి విజయం కోసం నిత్యం భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను అని యువన్ శంకర్ రాజా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement