
విజయసాయి రెడ్డి
సాక్షి, విశాఖ: ఇస్లాం మతబోధనలు భూమి మీద శాంతిని స్థాపించగలవనే విశ్వాసం తనకుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రమజాన్ మాసం అంటే భక్తిప్రపత్తులకు, నిబద్దతకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇస్లాం పవిత్ర గ్రంధం ఖురాన్ పుట్టిన నెల రమజాన్ మాసం అని గుర్తుచేశారు.
శాంతి సామరస్యాలు, సౌభ్రాతృత్వాలను పెంపొందించేదే మతం అని పేర్కొన్నారు. మతాలకు అతీతంగా ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర, దేశా ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నానని విజయసాయిరెడ్డి తెలిపారు.