‘2027 కల్లా ముస్లిం రాజ్యంగా భారత్‌’ | India will become Islamic nation by 2027 if Muslim population continues to grow: Hindu Yuva Vahini | Sakshi
Sakshi News home page

‘2027 కల్లా ముస్లిం రాజ్యంగా భారత్‌’

Published Wed, Nov 1 2017 10:55 AM | Last Updated on Wed, Nov 1 2017 10:56 AM

India will become Islamic nation by 2027 if Muslim population continues to grow: Hindu Yuva Vahini

మీరట్‌ : 2027 కల్లా భారత్‌ను ఇస్లాం రాజ్యంగా మార్చాలని ముస్లింలు యోచిస్తున్నారని హిందూ యువవాహిని ఆరోపణలతో దుమారం చెలరేగింది. ఇందుకోసం కావాలనే భారత్‌లోని ముస్లింలు సంతానాన్ని పెంచుకుంటూపోతున్నారని అంది. ఎక్కువ మంది పిల్లల్ని కంటున్న ముస్లిం వారిని భరిస్తుంది భారత్‌ను అక్రమించుకునేందుకని ఆరోపించింది.

ముస్లింలు పిల్లల్ని కనడం తగ్గించకపోతే 2027 కల్లా భారత్‌ ఇస్లాం రాజ్యంగా మారడం ఖాయమని హిందూ యువవాహిని పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ అధ్యక్షుడు నాగేంద్ర ప్రతాప్‌ తోమర్‌ వ్యాఖ్యనించారు. ముస్లిం కమ్యూనిటీ ఈ కుట్రకు ప్రధాన సూత్రధారని కూడా ఆరోపించారు. అఖండ భారతావనిని ముస్లింలు తమ పిడికిట పట్టాలని భావిస్తున్నారని అ‍న్నారు. హిందూ యువవాహిని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 2002లో స్థాపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement