
మాస్కో: రష్యాలోని దగెస్తాన్ ప్రాంతంలోని కిజ్‌లయార్ పట్టణంలో ఆదివారం ఓ చర్చిలో ఇస్లాం ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు మృతిచెందారు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఆ తరువాత పోలీసులు నిందితుడిని హతమార్చారు. ప్రార్థన చేస్తున్న క్రైస్తవులపై గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడని, నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళ ఆసుపత్రిలో కన్ను మూసినట్లు అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖ పేర్కొంది. దుండగుడి వయసు 20–30 ఏళ్ల మధ్య ఉంటుందని, అతడు స్థానికుడేనని ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ‘అల్లాహు అక్బర్’ అని నినదిస్తూ గడ్డంతో ఉన్న వ్యక్తి రైఫిల్, కత్తితో చర్చిలోకి చొచ్చుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఫాదర్ పావెల్ చెప్పారు. చెచెన్యాకు సరిహద్దుగా ఉన్న దగెస్తాన్ రష్యాలోని కల్లోలిత ప్రాంతాల్లో ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment