మానవత్వమే ఇస్లాం అభిమతం
నంద్యాలవిద్య: మానవత్వమే ఇస్లాం అభిమతమని జమాతే ఇస్లామిక్ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ సలాం దస్తగిరి అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక అంటికోట మసీదు ఆవరణలో ఆ సంఘం జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ గత 70సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా ఉత్తమ సమాజ నిర్మాణానికి, మానవ విలువలు పెంపొందించడానికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మీడియా సెక్రటరీ అక్బర్, సామాజిక కార్యదర్శి మౌలానా ఇదురుల్లా హుసేన్, పట్టణ అధ్యక్షుడు జక్రియ, తదితరులు పాల్గొన్నారు.