ఆనందంలో హద్దులు దాటొద్దు
రుజు మార్గం
సంతోషం మానవ నైజంలో ఉన్న సహజ గుణం. సంతోష సమయాల్లో కొత్త వస్త్రాలు ధరించడం, రుచి కరమైన వంటలు ఆరగించడం, నిషిద్ధాలకు దూరంగా ఇతర పద్ధతుల్లో కూడా సంతోషకర భావాలను వ్యక్తం చేయడం తప్పుకాదు. ధర్మం మానవుల సహజ అవస రాలను గుర్తించి, కొన్ని ధర్మసమ్మతమైన మార్గాల్లో వాటిని తీర్చుకునే విధంగా ప్రోత్సహిస్తుంది. కృత్రిమ త్వాన్ని, లేని గాంభీర్యాన్ని తెచ్చి పెట్టుకొని, ఆనందానికి దూరంగా ఉండమని ధర్మం చెప్పదు. అలా అని, హద్దు ల్ని అతిక్రమించి, అధర్మ, అవాంఛనీయ కార్యకలాపా లకు పాల్పడటాన్నీ అది సమ్మతించదు. ఎందుకంటే ధర్మంలో ప్రతిదానికి ఒక హద్దు, పరిధి ఉన్నాయి.
ఉదాహరణకు ఒక పండుగనే తీసుకుందాం. ఆనందతరంగాల్లో తేలియాడుతూ సంబరం చేసుకునే సందర్భం. అయితే ఆ సమయాన తాగితందనాలాడ తానంటే, జూదంలో మునిగి తేలతానంటే కుదరదు. ధర్మం సమ్మతించదు. ధార్మికంగానే కాకుండా, సామాజికంగా కూడా ఇది నేరమే. దైవిక చట్టాలేకాదు, ప్రపంచంలోని శాసనాలు కూడా ఇలాంటి చేష్టలను హర్షించవు. కనుక ధార్మిక పరిధుల్ని అతిక్రమించకుండా, ధర్మసమ్మతమై న మార్గాల్లో సంబరాలు జరుపుకోవ డం సమ్మతమే. దైవధర్మం మానవు ల్ని సంతోషంగా, నూతనోత్సాహంతో, ప్రపుల్ల భావాలతో ఉంచాలని అభిలషిస్తుంది. అందుకే అది ఒక పరిధి మేర మానవులకు స్వేచ్ఛను, స్వయం నిర్ణయాధికారాలను ప్రసాదించింది.
నూతన సంవత్సర వేడుకైనా ఇంతే. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాల ప్రవాహంలో కొత్త వత్సరాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. క్యాలెండర్లు మారుతూనే ఉంటాయి. కాలం ఎవరి కోసం ఆగదు. దాని వెంట పరుగెత్తలేని వారు మరుగున పడిపోతారు. రాజులు, రారాజులు, మాన్యులు, సామాన్యులు, పండి తులు, పామరులు- అందరూ కాలగర్భంలో కలసిపో వలసినవారే. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేట ప్పుడు ఈ వాస్తవాలను గమనంలో ఉంచుకోవాలి. గత కాలం నుండి గుణపాఠం నేర్చుకుంటూ, భవిష్యత్తుకు స్వాగతం పలకాలి. నిస్సందేహంగా కొత్త సంవత్స రాన్ని సంతోషంగా స్వాగతించవలసిందే. కాని ఆ సం తోషంలో హద్దుల అతిక్రమణ జరగకుండా చూసుకో వాలి. మందు, చిందు ఇంకా ఇతరేతర నిషిద్ధ కార్యా లతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడం ఎంత వరకు సమంజసం అన్న స్పృహ జాగృతం కావాలి. గత ఏడాది ఏమేమి చేశామన్నది ఆత్మపరిశీలన చేసుకో వాలి. మంచిపనులు చేసి ఉంటే, ఈ ఏడాది వాటిని ఇంకా అధికంగా, ఉత్తమంగా చేయాలని సంకల్పిం చుకోవాలి. తప్పులు, పాపాలు దొర్లి ఉంటే, వాటి పట్ల పశ్చాత్తాపం చెంది, భవిష్యత్తులో వాటి జోలికి పోనని నిజాయితీగా ప్రతిజ్ఞ చేసిన వారిని అల్లాహ్ అమితంగా ప్రేమించి, గత పాపాలను క్షమిస్తాడని ముహమ్మద్ ప్రవక్త(స) ప్రవచించారు. ఎవరి జీవితం ఎప్పుడు సమా ప్తమో ఎవరికీ తెలియదు కనుక, ఆనంద సమయమని హద్దుల్ని అతిక్రమించక, ధర్మబద్ధంగా సంతోష, సంబ రాలు జరుపుకుంటే ఇహలోక జీవితమూ ఆనందమ యమవుతుంది. పరలోక జీవితమూ సఫలమవుతుంది.
యం.డి.ఉస్మాన్‌ఖాన్