మీడియాతో తొలిసారి మాట్లాడుతున్న హదియా దంపతులు
కేరళ: ఇస్లాం మతం స్వీకరించడం వల్లనే ఎన్నో అవమానాలను, సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చిందని 'లవ్ జీహాద్' తీర్పు అనంతరం హదియా తెలిపారు. వారి వివాహం చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం తొలిసారి భర్త షఫిన్ జహాన్‌తో కలిసి ఆమె కేరళ వెళ్లారు. హదియా కేసులో న్యాయపరంగా ఎంతో కీలక పాత్ర పోషించిన 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' నాయకులను మర్యాదపూర్వకంగా ఆమె కలిశారు. ఇస్లామిక్ సంస్థ ముఖ్య నేత సైనాబాను కోజికోడ్‌లో కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. హాదియా మత మార్పిడిలో సైనాబానే కీలక పాత్ర వహించింది.
ఈ సందర్భంగా సైనాబా స్పందిస్తూ సుప్రీంకోర్టు హదియా, జహాన్‌ల వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించడం తనకు సంతోషాన్ని కలిగించిందని అన్నారు. తమ కూతుర్ని బలవంతంగా మత మార్పిడి చేసి, ఇస్లాం స్వీకరించేలా ప్రోత్సహించి వివాహం చేసుకున్నారని హదియా తండ్రి కేరళ హైకోర్టును ఆశ్రయించగా తొలుత ఈ కేసును విచారించిన హైకోర్టు వారి విహహాం చెల్లదని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ కోర్టును సుప్రీంకోర్టులో హదియా దంపతులు సవాల్ చేయగా రెండేళ్ల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment