సాక్షి, తిరువనంతపురం : దాదాపు ఏడాది కాలం వారిద్దరి మధ్య విరామం. భార్య భర్తలైనప్పటికీ లవ్ జిహాద్ వివాదం వల్ల దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈ డిసెంబర్ 3న వారిద్దరు ఓ కాలేజీలో సీసీటీవీ కెమెరాల మధ్య కలిసేలా అవకాశం కల్పించారు. ఆ సమయంలో వారిద్దరు పొందిన అనుభూతిని మీడియాతో పంచుకున్నారు. ఇంతకీ ఆ జంట ఎవరో కాదు.. కేరళకు చెందిన హదియా (24), షఫీన్ జహాన్‌లు. వాస్తవానికి హదియా ముందు ఓ హిందువు. ఆమె పేరు అఖిల.. ఓ కాలేజీలో హోమియోపతి విభాగంలో విద్యనభ్యసిస్తున్న ఆమెను ఇంట్లో ఓ పండుగకు ఆహ్వానించగా అందులో పాల్గొనేందుకు నిరాకరించింది. దాంతో ఆమె తండ్రి అశోకన్ కేఎం వివరాలు తెలుసుకోగా షాకింగ్ అంశాలు తెలిశాయి.
ఆ అఖిల ఇప్పుడు నాటి అఖిల కాదని హదియాగా మారిందని, ముస్లిం మతంలోకి మారి వివాహం కూడా చేసుకుందని తెలిసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇస్లామిక్ స్టేట్ సంస్థ చేసిన కుట్రలో భాగంగా తన కూతురుని బలవంతంగా మతం మార్పించారని, ఉగ్రవాద సంస్థలో చేరేలా ప్రేరేపించారని, అందుకే తనను హదియా మార్చారని వివరించారు. వారి పెళ్లిని కూడా రద్దు చేయాలని అందులో కోరారు. దీనికి అంగీకరించిన కోర్టు ఈ వ్యవహారంపై ఎన్‌ఐఏ విచారణకు ఆదేశించింది. దీంతో హదియా భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడి పిటిషన్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆమె తిరిగి తన విద్యను కొనసాగించేందుకు అవకాశం ఇవ్వడం మాత్రమే కాకుండా ఆమెకు సంరక్షకుడిగా ఓ డీన్ కూడా పెట్టింది. ఎవరు ఎలాంటి సమస్యను ఆమెకు సృష్టించాలని చూసినా అతడే చర్యలు తీసుకునేలా అవకాశం కల్పించింది. అయితే, వారి వివాహం విషయంలో పిటిషన్ మాత్రం జనవరి నెలలో విచారిస్తామని తెలిపింది.
ఎట్టకేలకు భర్తను కలిసింది..
Published Sat, Dec 9 2017 3:11 PM | Last Updated on Sat, Dec 9 2017 4:38 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment