సేలం: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లవ్ జిహాద్ వ్యవహారంలో యువతి హదియా సుప్రీంకోర్టు సూచన మేరకు తన వైద్యవిద్య కొనసాగించేందుకు మంగ ళవారం సేలం చేరుకున్నారు. వివరాలు.. కేరళ రాష్ట్రానికి చెందిన యువతి అఖిలఅశోకన్. ఈమె సేలంలోని సిద్ధక్ కోవిల్ ప్రాంతంలో హోమియోపతి వైద్య కళాశాల్లో వైద్య విద్య చదువుతోంది. ఈ క్రమంలో నాలుగున్నరేళ్లు చదువుకున్న అనంతరం కేరళకు వెళ్లిన అఖిల ఇంటర్న్‌షిప్ పూర్తి చేయలేదు. కేరళకు వెళ్లిన ఆమె అక్కడ షబ్బిన్ జహాన్ అనే ముస్లిం యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది.
అంతేకాకుండా మతం మారి తన పేరును హదియాగా మార్చుకుంది. తన కుమార్తెకు మాయమాటలు చెప్పి, మతం మార్చి వివాహం చేసుకున్నారని ఆమె తండ్రి కేరళ కోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో ఆమె వివాహం చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ హదియా భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన సుప్రీం కోర్టు ఆమె చదువును కొనసాగించాలని సూచించింది. దీంతో హదియా మంగళవారం సాయంత్రం సేలం కళాశాలకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment