యువతి స్నానం చేస్తుండగా.. | Man Arrested For Trying To Take Obscene Photos of 18 Years Old | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 1 2019 1:24 PM | Last Updated on Tue, Jan 1 2019 2:24 PM

Man Arrested For Trying To Take Obscene Photos of 18 Years Old - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : యువతి స్నానం చేస్తుండగా సెల్‌లో ఫొటోలు తీసేందుకు యత్నించిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఢిల్లీలోని శంకరపురలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. యువతి స్నానం చేసి వస్తుండగా పైఅంతస్తులో నివాసముండే 42 ఏళ్ల వ్యక్తి బాల్కనీలో ఉండడం గమనించారు. అతని చేతిలో మొబైల్‌ ఉండడం.. అంతకు ముందుకూడా తనతో అసభ్యంగా ప్రవర్తించి ఉండడంతో ఆమెకు అనుమానం కలిగింది.  స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడేమోనని నిశ్చయించున్నారు. అదేవిషయమై అతన్ని ప్రశ్నించడంతో తటపటాయించాడు. పొంతనలేని సమాధానాలు చెప్తూ ఇంట్లోకి జారుకున్నాడు. జరిగిన విషయాన్ని ఇంట్లోని వారికి చెప్పిన యువతి తన తల్లిదండ్రులతో కలిసి నిందితున్ని నిలదీశారు. నిందితుడు తనకేమీ తెలియదని చెప్పి తప్పించుకోజూశాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేశామని, విచారణ ప్రారంభించామని తెలిపారు. ఓ ప్రముఖ హిందీ దిన పత్రికలో నిందితుడు టెక్నిషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement