ఎంప్లాయ్స్‌ అంతా బాస్‌ పోయాడనుకున్నారు! Boss leaps from a BALCONY in front of shocked staff at a meeting | Sakshi
Sakshi News home page

ఎంప్లాయ్స్‌ అంతా బాస్‌ పోయాడనుకున్నారు!

Published Thu, Jun 8 2017 2:24 PM

ఎంప్లాయ్స్‌ అంతా బాస్‌ పోయాడనుకున్నారు!

మోస్టర్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను బాస్‌ మీటింగ్‌ ఉందంటూ పిలిచాడు. మీటింగ్‌కు వెళ్లిన వారితో ఉత్సాహంగా మాట్లాడాడు. తన ప్రసంగంతో అదరగొట్టాడు. ఇక​మీటింగ్‌ ముగిసిందనగా.. ఒక‍్కసారిగా బిల్డింగ్‌ బాల్కనీలోంచి కిందకు దూకాడు. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు ఆందోళనతో పరుగులు తీశారు. కొందరైతే తమ బాస్‌ ఇక లేడనుకున్నారు.

బోస్నియా అండ్‌ హెర్జిగోవినాలోని మోస్టర్‌లో క్రెజిక్‌ అనే క్రేజీ బాస్‌ చేష్టలకు ఉద్యోగులకు నోటమాటరాలేదు. ఎన్‌సాఫ్ట్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఫౌండర్‌, ఓనర్‌ అయిన క్రెజిక్‌.. కార్యాలయం నుంచి అలా కిందకు దూకగానే ఉద్యోగులు ఉరుకులు పరుగులతో బాల్కనీలోకి వచ్చి చూశారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న క్రాష్‌ మ్యాట్‌ మీద బాస్‌ నవ్వుతూ కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. తన ఉద్యోగులకు ‘పొలిటికల్‌ సూసైడ్‌’ అనే అంశం గురించి చెప్పడానికే తాను అలా చేశానని క్రెజిక్‌ వెల్లడించాడు. అన్నట్లు గతంలోనూ ఉద్యోగులను ఇలాంటి చేష్టలతో క్రెజిక్‌ షాక్‌కు గురిచేశాడట. ఆన్‌లైన్‌ గేమింగ్‌, స్పోర్ట్స్‌ బెట్టింగ్ ఇండస్ట్రీలో ఎన్‌సాఫ్ట్‌కు మంచి పేరుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement