బాల్కనీలో బందీనయ్యా! | ileana feeling tweets in twitter | Sakshi
Sakshi News home page

బాల్కనీలో బందీనయ్యా!

Published Thu, Oct 2 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

బాల్కనీలో బందీనయ్యా!

బాల్కనీలో బందీనయ్యా!

‘‘హఠాత్తుగా వర్షం కురిసింది. దానివల్ల నా ప్లాన్ అంతా పాడైపోయింది. ఆ వర్షం కారణంగా నా బాల్కనీ తలుపు మీద బలప్రయోగం చేయాల్సి వచ్చింది’’ అని ఇలియానా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆ సాయంత్రం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండటంతో ఇలియానాకి వాకింగ్‌కి వెళ్లాలనిపించిందట. హుషారుగా రెడీ అయిపోయి, ఇంటి బయట కాలుపెట్టాలనుకుంటున్న సమయంలో చిరుజల్లులు మొదలయ్యాయి. దానికి తోడు బలమైన గాలి కూడా.

మేడ మీద బాల్కనీలో తలుపులు తెరిచి ఉండటంతో ఇలియానా పైకి వెళ్లారు. వాన చినుకుల్ని, చల్లని గాలినీ ఆస్వాదించాలని ఆమె బాల్కనీలోకి వెళ్లారు. ఆ తర్వాత జరగకూడనిదే జరిగింది. గాలికి బాల్కనీ తలుపు లాక్ అయిపోయిందట.

ఇంట్లోకి రావాలంటే తాళం కావాలి. కానీ, ఆ తాళం ఎక్కడుందో పాపం ఇలియానాకి గుర్తు రాలేదు. ‘‘కాసేపు బాల్కనీలో బందీనయ్యా’’ అన్నారు ఈ బ్యూటీ. చివరికి తలుపు బద్దలు కొట్టి, లోపలికొచ్చారట. మూడ్ అంతా పాడైపోయిందని, నేనొకటి ప్లాన్ చేస్తే, ప్రకృతి మరోటి ప్లాన్ చేసిందని తన ట్విట్టర్‌లో ఇలియానా పేర్కొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement