సాక్షి, హైదరాబాద్: మెట్రో నగరాల్లో విశాలమైన విస్తీర్ణాల్లోని ఇల్లు కొనాలంటే మధ్య తరగతివాసులకు కష్టమే. చిన్న ఫ్లాట్లనూ కొనుగోలు చేసినా సరే.. కాస్త పొందికగా ఇంటీరియర్‌ను అమర్చుకుంటే చాలు! ఇల్లు విశాలంగా కనిపిస్తుంది.
ఇల్లు విశాలంగా కనిపించాలంటే ఇంట్లో అమర్చే ఫర్నీచర్ పొందికగా ఉండాలి. అలాగే ఆ ఫర్నీచర్ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ వేర్వేరు అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇలాంటి స్పేస్ సేవింగ్ ఫర్నీచర్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. రబ్బర్ ఉడ్‌తో తయారు చేసే స్పేస్ సేవింగ్ ఫర్నీచర్‌కు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇది వాటర్ ప్రూఫ్, స్క్రాచ్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్. అలాగే ఈ ఫర్నీచర్‌ను విడి భాగాలుగా విడదీసి తిరిగి బిగించుకునే వీలుంటుంది. ఇలా రెండు మూడు సార్లు విప్పదీసి బిగించుకున్నా చెక్కుచెదరదు. ఈ ఫర్నీచర్‌కు కంపెనీలు వారంటీని సైతం అందిస్తున్నాయి.
వంటగది
వంటగది లేదా లివింగ్ రూమ్‌లో సెరామిక్ లేదా గ్లాస్‌వేర్‌ను అలంకరిం టానికి వాల్ క్యాబినెట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. గోడకు ఆనించే వీలున్న ఈ స్పేస్ సేవింగ్ వాల్ క్యాబినెట్స్‌లో క్రాకరీ డిస్‌ప్లేకు వీలుగా గ్లాస్ షెల్ఫ్, ఇతర వస్తువుల కోసం సొరుగులుంటాయి. ఈ వాల్ క్యాబినెట్ టేబుల్‌గా కూడా ఉపయోగపడుతుంది. లివింగ్ రూమ్‌లోనైతే దీని మీద ఫొటో ఫ్రేములు, ఫ్లవర్ వాజులుంచుకోవచ్చు.
డ్రెస్సింగ్ అద్దం
ఇంట్లోని మొత్తం ఫర్నీ చర్‌లో డ్రెసింగ్ మిర్రర్‌ది ప్రత్యేక స్థానం. కాబట్టి ఇల్లు ఎంత చిన్నదైనా డ్రెస్సింగ్ మిర్రర్ కొనకుండా ఉండలేం. అయితే దాని వల్ల ఇల్లు ఇరుకుగా మారకుండా ఉండేలా చూసుకుంటే అవసరంలో పాటు ముచ్చటా తీరుతుంది. ఇందుకోసం స్థలం కలిసొచ్చేలా గోడకు ఫిక్స్ చేసేలా వీలుండే డ్రెస్సింగ్ మిర్రర్‌ను ఎంచుకోవాలి. ఇలాంటి మినీ మలిస్టిక్ డ్రెస్సింగ్ మిర్రర్‌ను ఎంచుకుంటే అద్దాన్ని విడిగా గోడకు బిగించి దానికింద సొరుగులున్న టేబుల్‌ను ఉంచి వాడుకోవచ్చు.
డైనింగ్ టేబుల్
డైనింగ్ టేబుల్ కోసం ఇంట్లో డైనింగ్ ఏరియా తప్పనిసరేం కాదు. ఇల్లు ఇరుకవుతుందనే భయం లేకుండా తక్కువ స్థలంలో ఇమిడిపోయే కోజీ డైనింగ్ టేబుల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం 3 నుంచి నాలుగడుగుల వైశాల్యాన్ని మాత్రమే ఆక్రమించే నాలుగు కుర్చీల డైనింగ్ టేబుల్‌ను ఎంచుకుంటే ఇల్లు ఇరుగ్గా మారదు.
డెకరేషన్
గోడవారగా వేసుకునే సైడ్ టేబుల్స్ వేర్వేరు అవసరాల కోసం ఉప యోగించుకోవచ్చు. డ్రాలు, షెల్ఫ్ లు కలిసి ఉండే ఈ సైడ్ టేబుల్‌ను పుస్తకాలు, అరు దుగా ఉపయోగించే ఇతర వస్తువుల కోసం విని యోగించుకోవచ్చు. ఈ టేబుల్ బోసిగా కనిపించకుండా పెద్దవిగా ఉండే డెకరేటివ్ ఐటమ్స్ ను అమర్చుకోవచ్చు.
పొందికగా సొంతిల్లు
Published Sat, Nov 17 2018 1:25 AM | Last Updated on Sat, Nov 17 2018 1:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment